Thursday, 14 March 2019

నాలుగు జిల్లాల గొంతుకగా పోరాడతా

‒ కరీంనగర్‌‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి  ఎడ్ల రవికుమార్‌‌ పటేల్‌‌
 నిజామాబాద్‌‌:   మీలో ఒక యువకుడిగా, గ్రాడ్యుయేట్‌‌గా మన జిల్లాల కష్టాలు, ప్రజల అవసరాలు తెలలిసిన వాడిగా.. ఈ నాలుగు జిల్లాల గొంతుకగా శాసనమండలిలో పోరాడటానికి నాకు అవకాశం ఇవ్వాలని కరీంనగర్‌‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎడ్ల రవికుమార్‌‌ పటేల్‌‌ కోరారు. ఆయన గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్‌‌క్లబ్‌‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దివ్యాంగులకు విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో కోటా పంపునకు, ప్రతి మండల కేంద్రంలో గ్రంథాలయం అలాగే ప్రతి జిల్లాకేంద్రంలో మహిళా గ్రాడ్యుయేట్‌‌ల కోసం ఉమెన్స్‌‌ హాస్టల్‌‌ ఏర్పాటుకు, కాంట్రాక్ట్‌‌ ఉద్యోగుల క్రమబద్దీకరణ తదితర  సమస్యలపై పరిష్కారం దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పట్టభద్రులు ఆలోచించి ఒక యువకునిగా తనకు అవకాశం ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు.


విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ అభ్యర్థి  ఎడ్ల రవికుమార్‌‌ పటేల్‌‌


No comments:

Post a Comment