Friday, 22 March 2019

సారంగాపూర్‌‌ హనుమాన్‌‌ని దర్శించుకొన్న ఎంపీ కవిత

 నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ శివారులోని సారంగాపూర్ హనుమాన్‌‌ దేవాలయాన్ని సందర్శించి హనుమంతున్ని  దర్శించుకున్నారు.  శుక్రవారం  నిజామాబాద్ టీఆర్‌‌ఎస్‌‌ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసే ముందు  భర్త అనిల్‌‌తో కలిసి ఎంపీ కవిత సారంగాపూర్‌‌ ఆంజనేయుడికి  ప్రత్యేక పూజలు చేశారు.  నామినేషన్ పత్రాలను హనుమంతుని పాదాల చెంత ఉంచి మొక్కుకున్నారు. 
ఆమె వెంట నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాంకిషన్ రావు,  నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్ పర్సన్ గడ్డం సుమనారెడ్డి, నాయకులు ఈగ గంగారెడ్డి, మోహన్ రెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లు, స్థానిక టిఆర్ఎస్ నాయకులు  ఉన్నారు.No comments:

Post a Comment