Saturday, 9 March 2019

కొత్త ఈవీఎంలకు మాకు పోలింగ్ నిర్వహణ: -- కలెక్టర్

  జగిత్యాల నుండి వచ్చిన ఈవీఎంలకు మాక్ పోల్  నిర్వహించినట్లు జిల్లా  కలెక్టర్  ఎం.ఆర్.ఎం. రావు తెలిపారు.  శనివారం ఆయన  స్థానిక  ఈవీఎం గోదాంలో పర్యటించి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో వాటికి మాక్ పోలింగ్ నిర్వహించారు. అన్ని బటన్లు సరిగ్గా పని పనిచేస్తున్నాయా?  లేదా? ఈ మాక్ పోలింగ్  ద్వారా  గుర్తించవచ్చని, ఏ గుర్తుకు ఓటు వేశామో, అది సరిగ్గా ఓటు నమోదు అయిందో లేదో కూడాఈ మాక్ పోలింగ్  ద్వారా  గుర్తించడం  జరుగుతుందన్నారు.  సమస్యలు ఉన్న ఈవీఎంలను ఉపయోగించకుండా వేరేగా ఉంచుతామన్నారు. మరమ్మతుల అనంతరం మాత్రమే వాటి పనితీరును తిరిగి పరిశీలిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో   సంయుక్త కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్‌‌వో అంజయ్య, ఏవో శ్రీధర్, రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్‌‌ ఎం.ఆర్‌‌.ఎం.రావు

ఈవీఎంల పనితీరును పరిశీలిస్తున్న సిబ్బంది

No comments:

Post a Comment