Thursday, 14 March 2019

భయం వీడి పరీక్షలు రాస్తే విజయం మీదే..

ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్. బి.కేశవులు 

 పరీక్షలు వస్తున్నాయని తెలియగానే కొందరు, పరీక్ష హాల్లో ప్రశ్నాపత్రాన్ని చూడగానే ఇంకొందరు అయోమయానికి  గురై ఒక ప్రశ్నకు బదులు  మరో ప్రశ్నకు జవాబులు రాస్తున్నారని  పలితంగానే చాలామంది  పరీక్షల్లో తప్పు తున్నారని ప్రఖ్యాత మానసిక వైద్య నిపుణులు. కౌన్సిలింగ్ స్పెషలిస్ట్
 డాక్టర్ బి కేశవులు తెలిపారు

"" పరీక్షలంటే భయం-- తికమక " అనే అంశంపై  ఖలీల్ వాడిలో  జరిగిన అవగాహన కార్యక్రమానికి డాక్టర్ బి. కేశవులు ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు,

కొందరు ఒత్తిడి మూలాన ప్రశ్నా పత్రములు పరీక్ష హాల్లో ప్రశ్న పత్రము పూర్తిగా చదవకుండానే  జవాబు రాయడానికి సిద్ధపడుతూన్నారు, మరికొందరు బాగా చదివినను  కూడా  భయం లో అతిగా ఊహించుకుని అవసరానికి మించి ఎక్కువ రాయడం కూడా జరుగుతోంది,అయితే చిన్న చిన్న కన్ఫ్యూజన్లో వల్ల తక్కువ మార్కులే కాకుండా తక్కువ ర్యాంకులు కూడా వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని డాక్టర్ బి కేశవులు వివరించారు,

కొంతమంది పరీక్ష తేదీలను ప్రకటించిన చివరి క్షణాలలో చదివే వాళ్ళలో చాలామంది  కొన్ని జవాబులు మాత్రమే వ్రాసి, తీరా పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత ఫెయిల్ కావడం తమది తప్పు కాదని . పేపర్ దిద్దే వాళ్లదే తప్పు అని వాదిస్తుంటారు,

 కొందరు చిన్న చిన్న తికమక లను పసికట్ట లేక కన్ఫ్యూజ్ అయిపోయి, ఒక ప్రశ్నకు రాసే  జవాబును మరో ప్రశ్నకు  రాస్తుంటారు, అందుకే చదివేటప్పుడు ఏకబిగిన కాకుండా  విడగొట్టుకొని చదువుతే చాలా వరకు గుర్తుంటుందని డాక్టర్ బి కేశవులు అన్నారు ,

ఇంకొందరిలో ఇంకో సమస్య, మొదటిరోజు మొదటి పేపర్ జవాబులు సరిగ్గా రాయలేకపోతే ఆ  తర్వాత పరీక్షలపై తీవ్ర  ప్రభావము ఉంటుంది ,అందుకనే మొదటి పరీక్షల  ప్రభావమును వెంటనే మరిచిపోయి, మిగితా పరీక్షలపై శ్రద్ధ పెట్టి చదవాలి.
పరీక్షలు  జరుగుతున్న రోజుల్లో,   సమతుల్య ఆహారము మరియు సరైన నిద్ర విషయాలలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిందేనని డాక్టర్ తెలిపారు

పరీక్ష రోజున ఒక గంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలి అరగంట ముందుగానే పరీక్ష హాల్లోకి వెళ్లడం మూలాన ఒత్తిడి తగ్గి పోతుంది ఫలితంగా ప్రశాంత మనస్సుతో ఎగ్జామ్స్  మంచిగా వ్రాసే అవకాశం ఎక్కువగా ఉంటుందని డాక్టర్ కేశవులు తెలిపారు,

No comments:

Post a Comment