Saturday, 9 March 2019

బీడీ కార్మికులకు కరువుభత్యం ఇవ్వాలి

 బీడీ కార్మికులకు కరవుభత్యం ఇవ్వాలని తెలంగాణ  కామ్‌‌గార్‌‌‌ ఫెడరేషన్‌‌ రాష్ట్ర అధ్యక్షుడు టి.బాల్‌‌రాజ్‌‌ అన్నారు. ఆయన శనివారం నగరంలోని ప్రెస్‌‌క్లబ్‌‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ ఒప్పందం ప్రకారం ప్రతి సంవత్సరం ఏప్రిల్‌‌ 1 నుంచి 31 వరకు బీడీ కార్మికులకు సీపీఐ లెక్కల ప్రకారం ఎన్ని పాయింట్లు పెరిగితే అన్ని పాయింట్లకు ప్రతి పాయింట్‌‌కు  రూ.10 పైసల చొప్పున కరవుభత్యం పెంచి ఇవ్వాలని అన్నారు. ప్రస్తుతం పెరిగిన కరవుభత్యం కలుపుకొని బీడీ కార్మికులకు వెయ్యి బీడీలకు రూ.186 రూపాయల 14 పైసలు చెల్లించాలని ఆయన డిమాండ్‌‌ చేశారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్‌‌.బాల్‌‌నర్సయ్య, సలహాదారులు లక్ష్మీబాయి, సహాయకార్యదర్శి జె.బాబు, తార, నిర్మల తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న బాల్‌‌రాజ్‌‌

No comments:

Post a Comment