Friday, 15 March 2019

ఎన్నిక రోజున ముఖ్యమైన మాక్‌‌పోల్‌‌ మర్చిపోవద్దు: కలెక్టర్‌‌

  ఎన్నిక జరిగే రోజు ముందుగా మాక్‌‌పోల్‌‌ తప్పనిసరిగా నిర్వహించాలని, ఎట్టిపరిస్థితుల్లో మర్చిపోవద్దని జిల్లా కలెక్టర్‌‌, ఎన్నికల అధికారి ఎం.రామ్మోహన్‌‌ రావు తెలిపారు.  ప్రభుత్వ పాలిటెక్నిక్‌‌ కళాశాలలో రెండు రోజుల పాటు పోలింగ్‌‌ సిబ్బందికి నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాన్ని శుక్రవారం పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణకు హాజరైన సిబ్బందితో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు మాక్‌‌పోల్‌‌ చాలా ముఖ్యమైందన్నారు. పోలింగ్‌‌ ప్రారంభం కావడానికి ముందుగానే మాక్‌‌పోల్‌‌ నిర్వహించాలని, అవసరమనుకుంటే ఈ విషయాన్ని బోర్డుపై రాసి పెట్టుకోవాలన్నారు. అంతేకాక సి.ఆర్‌‌.సి. (క్లోజ్‌‌‒రిజల్ట్‌‌‒క్లియర్‌‌) విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని, మాక్‌‌పోలింగ్‌‌ పూర్తి కాగానే స్లిప్‌‌లను బయటకు తీసి సరిచూసుకొని బ్లాక్‌‌ కవర్‌‌లో భద్రపరచి ఈవీఎం క్లోస్‌‌ చేసి క్లియర్‌‌ చేసుకోవాలని సూచించారు. ఈవీఎంలను, వీవీప్యాట్‌‌లను తిరిగి ఫ్రెష్‌‌ చేసుకోవాలని తెలిపారు. డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల విధులలో పాల్గొనని సిబ్బంది ఎవరైనా ఉంటే వారికి శిక్షణ బాగా అర్థమయ్యేలా చూడాలన్నారు. పోలింగ్‌‌కు సంబంధించి ప్రారంభం నుంచి పూర్తయ్యేవరకు చేయవలసిన పనులను రాసిపెట్టుకోవాలని సూచించారు. పోలింగ్‌‌ అనంతరం ఫారం 17‒సి సరిగా పూర్తి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్‌‌ ఆర్‌‌డీవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్లు జ్వాలాగిరి రావు, వేణు, విష్ణుసాగర్‌‌, శిక్షణ అధికారి, ఎంపీడీవో సంజీవ్‌‌ తదితరులు పాల్గొన్నారు.

శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్‌‌ ఎం.రామ్మోహన్‌‌రావు

శిక్షణలో పాల్గొన్న ఎన్నికల సిబ్బంది

No comments:

Post a Comment