Tuesday, 12 March 2019

ఎంపీ కవితకు గాండ్ల తేలికుల సంఘం మద్దతు

 గాండ్ల తేలికుల  అభివృద్ధికి పాటుపడుతున్న తెరాస ప్రభుత్వానికి మద్దతుగా రాబోయే పార్లమెంట్‌‌ ఎన్నికల్లో నిజామాబాద్‌‌ ఎంపీగా కల్వకుంట్ల కవితకు తమ సంఘం పూర్తి మద్దతు తెలుపుతుందని ఆ సంఘం రాష్ట్ర జనరల్‌‌ సెక్రెటరి కె.లక్ష్మణ్‌‌ తెలిపారు.    మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్‌‌క్లబ్‌‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌  గాండ్ల తేలికుల సంఘం అభివృద్దికి ఒక ఎకరము భూమి, సంఘం ఆత్మగౌరవ భవనము కోసం కోటి రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించడం  పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.  ఈ సమావేశంలో  గాండ్ల తేలికుల సంఘం జిల్లా అధ్యక్షుడు  కూతురు అశోక్‌‌, గౌరవ అధ్యక్షుడు కూతురు రాజేశ్వర్‌‌, నాయకులు  నాగరాజు, గిరిబాబు, మోహన్‌‌, పోశెట్టి, రాములు, గంగాధర్, అబ్బయ్య, రాజ్ మహేందర్,  హనుమాండ్లు,  ఆర్ సాయిలు, డి.నర్సింలు తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment