Thursday, 21 March 2019

ఎన్నికల కాల్‌‌సెంటర్‌ను‌ ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్‌‌

 పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్  జారీ చేసినందున ఎన్నికలకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్  ఎం.రామ్మోహన్‌‌రావు  కలెక్టరేట్‌‌లో ఏర్పాటుచేసిన కాల్ సెంటర్‌‌ను గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను, వాటి పరిష్కారాలు ఏ విధంగా చేస్తున్నారు అని ఆపరేటర్లను అడిగి తెలుసుకున్నారు.  ఎన్నికలకు  సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు, ఆరోపణలు వచ్చినా   ఎం.సి.సి. నిఘా బృందాలకు తెలియజేయాలని కలెక్టర్ ఆదేశించారు.  అదేవిధంగా పి.డబ్ల్యు.డి సంబంధించిన బ్రెయిలీ ఓటరు గుర్తింపు కార్డుల డౌన్లోడ్ ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా సెంటర్‌‌ను సందర్శించి పెయిడ్ న్యూస్, లోకల్ కేబుల్లో వచ్చే వార్తలను పరిశీలించాలని  డీపీఆర్‌‌వో మహమ్మద్ ముర్తుజాను ఆదేశించారు. అంతకుముందు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా.. సిబ్బంది సంబంధిత పోలింగ్ స్టేషన్లకు  సురక్షితంగా చేరుకున్న విషయాన్ని సంబంధిత ఆర్డీవోలను అడిగి సమాచారం అందించాలని కలెక్టరేట్‌‌ సూపరింటెండెంట్‌‌ గఫార్‌‌ను ఆదేశించారు.



No comments:

Post a Comment