Friday, 22 March 2019

నీటిని పొదుపుగా వాడుకోవాలి


ఇందూరు యువత అసోసియేషన్‌‌ అధ్యక్షుడు సాయిబాబు

  నీరు జీవకోటికి ఆధారమని.. నీటిని పొదుపుగా వాడాలని ఇందూరు యువత అసోసియేషన్‌‌ అధ్యక్షుడు సాయిబాబు అన్నారు. ఆయన జిల్లా కేంద్రంలోని  పి.ఎం. కె.వి. వై (ప్రధానమంత్రి కౌషల్‌‌ వికాస్‌‌ యోజన) కేంద్రంలో ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన  అవగాహన సదస్సులో మాట్లాడారు. ప్రతి ఒక్కరు జల సంరక్షణను భాద్యతగా తీసుకోవాలన్నారు. నేటి యువత బాధ్యతను మరిచి ఎక్కడికక్కడ నీటిని వృధా చేస్తున్నారన్నారు.  నీటిని పొదుపుగా వాడడం అలవాటు చేసుకోవాలని లేకుంటే భవిష్యత్తులో తాగునీటికి సైతం ఇబ్బందులు పడాల్సివస్తుందన్నారు.  ప్రతి ఒక్కరి ఇంటిలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.   ఈసందర్భంగా ఆయన యువతీ యువకులతో  ‘జల సంరక్షణ ప్రతిజ్ఞ’ చేయించారు.  ఈ  సదస్సులో సంస్థ కార్యదర్శి ప్రసాద్‌‌,  సుభాష్,  సతీష్ గౌడ్, పి.ఎం. కె.వి. వై  రాజు, సిబ్బంది, యువతీ యువకులు పాల్గొన్నారు.



No comments:

Post a Comment