Friday, 15 March 2019

అనుమానిత బ్యాంక్‌‌ లావాదేవీల వివరాలివ్వండి

‒కలెక్టర్ ఎం.రామ్మోహన్‌‌రావు

 లోక్‌‌ సభ ఎన్నికలను పురస్కరించుకొని అనుమానిత బ్యాంక్‌‌ లావాదేవీల వివరాలను ఎప్పటికప్పుడు అందజేయాలని జిల్లా కలెక్టర్‌‌ శ్రీ ఎం.రామ్మోహన్‌‌రావు తెలిపారు.
శుక్రవారం ప్రగతిభవన్‌‌ సమావేశ మందిరంలో బ్యాంకర్లు, ఇన్‌‌కంటాక్స్‌‌ తదితర అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌‌ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్‌‌ లోక్‌‌సభ ఎన్నికల షెడ్యూల్‌‌ విడుదల చేయడంతోనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందని తెలిపారు. నామినేషన్‌‌ల ప్రక్రియ ఈనెల 18న మొదలై 25 వరకు కొనసాగుతుందన్నారు. అభ్యర్థులు, పార్టీలు, వారికి సంబంధించిన వ్యక్తుల లావాదేవీలను ఎన్నికల కమిషన్‌‌ పరిశీలిస్తుందన్నారు. అందువల్ల అభ్యర్థులు కాని, సంబంధిత రాజకీయ పార్టీలు కాని, అభ్యర్థుల భార్య, భర్త, వారిపై ఆధారపడ్డ వారి ఖాతాలకు సంబంధించి పరిశీలన ఉంటుందన్నారు. అటువంటి ఖాతాలపై లక్షకుపైగా జరిపే విత్‌‌ డ్రాయల్స్‌‌, డిపాజిట్ల పరిశీలన ఉంటుందన్నారు.  బ్యాంక్‌‌ అధికారులు   లక్షకుపైగా జరిపే విత్‌‌డ్రాయల్స్‌‌, డిపాజిట్ల వివరాలను ఎప్పటికప్పుడు అందించాలన్నారు. అదేవిధంగా రూ.10 లక్షలు దాటిన లావాదేవీల వివరాలను ఇన్‌‌కమ్‌‌ టాక్స్‌‌ నోడల్‌‌ అధికారికి పంపించాలన్నారు.
నామినేషన్‌‌లు వేసే అభ్యర్థులు దానికి ఒక రోజు ముందుగా కొత్తగా బ్యాంక్‌‌ ఖాతా తెరువవలసి ఉన్నందున అందు గురించి వచ్చే వారికి సహకరించాలని సూచించారు.  ఈ సమావేశంలో ఎల్‌‌.డి.ఎం. సురేష్‌‌రెడ్డి, ఇన్‌‌కంటాక్స్ నోడల్‌‌ అధికారి సంజయ్‌‌ పసూర్‌‌కర్‌‌, ఎంసిసి నోడల్‌‌ అధికారి సింహాచలం, బ్యాంక్‌‌ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌‌ ఎం.రామ్మోహన్‌‌రావు

No comments:

Post a Comment