Thursday, 14 March 2019

పగ్రతిలో నిజామాబాద్‌‌ జిల్లా భేష్‌‌

వీసీ సమీక్షా సమావేశంలో గ్రామీణాభివృద్ధి శాఖ సీఈవో పౌసమి బసు

నిజామాబాద్: బ్యాంకు లింకేజిలో నిజామాబాద్‌‌ జిల్లా లక్ష్యాన్ని మించి 107% శాతం ప్రగతి సాధించడంపై గ్రామీణాభివృద్ధి శాఖ సీఈవో పౌసమి బసు నిజామాబాద్‌‌ డీఆర్‌‌డీవోను అభినందించారు. ఆయన  గురువారం సాయంత్రం హైదరాబాద్‌‌ నుంచి  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  తెలంగాణలోని జిల్లాల డీఆర్‌‌డీవోలు, ఎపీఎం, డీపీఎంలతో బ్యాంకు లింకేజి, సంస్థాగత నిర్మాణం సంఘాల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఆయన ఈ సందర్భంగా  వీసీలో జిల్లా అధికారులతో మాట్లాడుతూ నిజామాబాద్‌‌ జిల్లా 2018‒2019 సంవత్సర లక్ష్యం 338.50 కోట్లకు గాను 365.50 కోట్లతో లక్ష్యాన్ని మించి సాధించడం అభినందనీయమన్నారు.  ఎస్‌‌.హెచ్‌‌.జి బ్యాంకు లింకేజి రుణాలు రికవరీలో కూడా నిజామాబాద్‌‌ జిల్లా 99% రికవరీతో ముందంజలో ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ ఇతర ఋణాల రికవరీలో 89% తో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని సీఈవో అభినందించారు. సంస్థాగత నిర్మాణం, వెబ్‌‌ అకౌంటింగ్‌‌, ఎస్‌‌.హెచ్‌‌.జి.ల గ్రేడింగ్‌‌ తదితర అంశాలపై సమీక్ష చేసి జిల్లా ప్రగతి అన్ని అంశాలలో ముందు ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు.
వీసీలో  డీఆర్‌‌డీవో రాథోడ్‌‌ రమేష్‌‌, అదనపు డీఆర్‌‌డీవో వినయ్‌‌కుమార్‌‌, డీపీఎంలు రాచయ్య, నీలిమ, సాయిలు, శ్రీనివాస్‌‌, ఎపీఎంలు సరోజిని, సీబీవో ఆడిటర్లు, ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు.



No comments:

Post a Comment