Friday, 15 March 2019

నేడు నిశిత డిగ్రీ కాలేజ్‌‌ సిల్వర్‌‌జూబ్లీ వేడుకలు

‒ హాజరుకానున్న ప్రముఖ సినీ సింగర్స్‌‌ మాళవిక, దినకర్‌‌ 

   జిల్లా కేంద్రంలోని నిశిత డిగ్రీ కళాశాల స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా శనివారం సిల్వర్‌‌జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌‌ జ్ఞానేశ్వర్‌‌ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.   మార్చి16, శనివారం రోజున నగరంలోని భూమారెడ్డి కన్వెన్షన్‌‌ హాల్‌‌లో 2 సెషన్‌‌లలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నామని తెలిపారు. మొదటి సెషన్‌‌ ఉదయం 9  నుంచి మధ్యామ్నం ఒంటి గంట వరకు, అలాగే రెండవ సెషన్‌‌ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉంటుందన్నారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఛైర్మన్‌‌ టి.పాపిరెడ్డి, తెలంగాణ యూనివర్సిటీ వైస్‌‌ఛాన్స్‌‌లర్‌‌ పి.సాంబయ్య తదితరులు హాజరవుతున్నారని తెలిపారు. అలాగే కార్యక్రమానికి ముఖ్య ఆకర్షణగా ప్రముఖ సినీ గాయకులురాలు మాలవిక, గాయకుడు దినకర్‌‌లు హాజరుకానున్నట్లు ఆయన పేర్కొన్నారు.  

No comments:

Post a Comment