Tuesday, 12 March 2019

నేడు విశ్వహిందూ పరిషత్‌‌ రథయాత్ర, ర్యాలీ

  రామదాస మిషన్ యూనివర్సల్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీ శక్తి శాంతానంద మహర్శి  నేతృత్వంలో బుధవారం రథయాత్ర, భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు గంగా కిషన్ తెలిపారు. ఆయన మంగళవారం  నగరంలోని ప్రెస్‌‌క్లబ్‌‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రథయాత్ర శివరాత్రి రోజున రామేశ్వరంలో మొదలైందని,  అలాగే శ్రీరామ నవమి రోజున అయోధ్య చేరుతుందన్నారు.  ఈ యాత్రలో భాగంగా నేడు మార్చి 13న ఉదయం 10 గంటలకు  మాధవ నగర్ సాయిబాబ దేవాలయం నుండి మొదలై పులాంగ్‌‌, కలెక్టర్‌‌ గ్రౌండ్‌‌ చౌరస్తా, రైల్వేస్టేషన్‌‌, నాందేవ్‌‌వాడ బ్రిడ్జి, శివాజి చౌక్‌‌, దుబ్బ చౌరస్తా ల మీదుగా విశ్వహిందూ పరిషత్‌‌ కార్యాలయం వరకు కొనసాగుతుందని తెలిపారు. అనంతరం మేరు భవన్‌‌లో సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు.    ఈ ర్యాలీలో హిందువులందరూ  పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో వి.హి.ప. జిల్లా ఉపాధ్యక్షులు తాడూరి ప్రవీణ్ కుమార్, సహ కార్యదర్శి బి.కిషన్‌‌, బజరంగ్‌‌దళ్‌‌ విభాగ్‌‌ సహ సంయోజక్‌‌ రాజేష్ కుమార్  తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment