Saturday, 9 March 2019

ప్రారంభమైన టీఎమ్‌‌ఎస్‌‌ఆర్‌‌యూ మూడవ మాహా సభలు


  టీఎమ్‌‌ఎస్‌‌ఆర్‌యూ‌ ( తెలంగాణ మెడికల్‌‌  అండ్‌‌ సేల్స్‌‌ రిప్రజెంటేటివ్స్‌‌ యూనియన్‌‌) మూడవ మహాసభలు నగరంలోని ఆర్మూర్ రోడ్ లో గల లక్ష్మీ కళ్యాణ మండపంలో  శనివారం ఉదయం  ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మొదటిరోజు అయిన శనివారం  టీఎమ్‌‌ఎస్‌‌ఆర్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు మురళి జెండా  ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్‌‌ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బి.రమేష్ హాజరై ప్రసంగిస్తూ.. భాజపా ప్రభుత్వం కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.  రాష్ట్ర  ఉపాధ్యక్షుడు ఆర్.సుధా భాస్కర్‌‌ మాట్లాడుతూ   రాష్ట్ర ప్రభుత్వ  ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాల వల్ల కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.   సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కూడానూర్జహాన్‌‌ మాట్లాడుతూ  ఈ మహాసభలు నిజామాబాద్‌‌లో జరగడం శుభపరిణామమని, ప్రజల తరఫున పోరాటానికి సహకారం అందిస్తామన్నారు.  టీఎమ్‌‌ఎస్‌‌ఆర్‌‌యూ ప్రధాన కార్యదర్శి పట్టు మాట్లాడుతూ ఈ రోజు మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్‌‌ వారి  సమస్యల గురించే కాకుండ  అన్ని రంగాల్లో  ప్రజల పక్షాన పోరాటం చేస్తుందన్నారు.  మందులపై జీరో పర్సెంట్  జీఎస్టీ  ఉండాలని ఆయన డిమాండ్‌‌ చేశారు.  మందులు అతిముఖ్యమైనవి కాబట్టి ప్రజలకు తక్కువ ధరలకు మందులు ఇవ్వాలంటే  ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలన్నారు.  ఈ కార్యక్రమంలో  టీఎమ్‌‌ఎస్‌‌ఆర్‌‌యూ జిల్లా  అధ్యక్షుడు   బి.సంపత్ కుమార్,  కార్యదర్శి  కె. సునీల్ కుమార్,   ఆర్‌‌. శ్రీనివాస్,  రాజేష్ గుప్త,  కరీముల్లా,  రాష్ట్రవ్యాప్తంగా  ఉన్నటువంటి టీఎమ్‌‌ఎస్‌‌ఆర్‌‌యూ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న టీఎమ్‌‌ఎస్‌‌ఆర్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు మురళి 



No comments:

Post a Comment