Saturday, 9 March 2019

బోగస్‌‌ ఓట్లను తొలగించాలి

భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధర్మపురి అరవింద్‌‌

 గత అసెంబ్లీ ఎన్నికల్లో 1.25 లక్షల బోగస్‌‌ ఓట్లు ఉన్నాయని గుర్తించామని వెంటనే బోగస్‌‌ ఓట్లను తొలగించాలని కోరుతూ భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధర్మపురి అరవింద్‌‌ ఆధ్వర్యంలో జిల్లా భాజపా నాయకులు శనివారం డీఆర్‌‌వో అంజయ్యను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం  భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధర్మపురి అరవింద్‌‌ మాట్లాడుతూ నిజామాబాదు పార్లమెంట్ సెగ్మెంట్ లో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఫైనల్ ఓటర్ లిస్టు ప్రకారం సుమారు 1.25 లక్షల  ఓట్ల బోగస్ ఉన్నాయని, ఆందులో 47  వేల వరకు నిజామాబాదు పట్టణంలోనే ఉన్నాయని గుర్తించామన్నారు. ఈమేరకు బోగస్ ఓట్లను తొలగించాలని రెండు రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్‌‌ని కలవడం జరిగిందన్నారు.   బోగస్ ఓట్ల కారణంగానే తెరాస పార్టీ వారు అంత ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఎంతెంత మెజార్టీతో గెలవగలరో ముందే చెప్పగలుగుతున్నారన్నారు. ఈ బోగస్ ఓట్ల EPIC నంబర్లతో సహా మేము అందజేస్తున్నాం కాబట్టి వెంటనే చర్య తీసుకోవాలని వారు డిమాండ్  చేశారు. లేనిచో కేంద్ర ఎన్నికల ప్రధానాధికారికి  ఫిర్యాదు  చేయడంతో పాటు హై కోర్ట్ ని కూడా ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు.  వినతిపత్రం అందజేసిన వారిలో భాజపా జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, జిల్లా భాజపా సీనియర్‌‌ నాయకులు బస్వా లక్ష్మినర్సయ్య, జిల్లా నాయకులు, భాజపా కార్పొరేటర్లు, కార్యకర్తలు ఉన్నారు.

డీఆర్‌‌వో అంజయ్యకు వినతిపత్రం ఇస్తున్న ధర్మపురి అరవింద్‌‌

 

No comments:

Post a Comment