Saturday, 9 March 2019

నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు: -- కలెక్టర్ ఎం.ఆర్‌‌.ఎం.రావు

 ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ  పోలియో చుక్కలు వేయించాలని, పిల్లలు పోలియో బారిన పడకుండా రక్షించాలని జిల్లా కలెక్టర్   ఎం. ఆర్. ఎం. రావు సూచించారు.  ఈ నెల 10 నుండి మూడు రోజులపాటు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని పురస్కరించుకుని శనివారం కలెక్టరేట్ వద్ద జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అప్పుడే పుట్టిన  శిశువు నుండి ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ తప్పని సరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. తద్వారా  పిల్లలు  పోలియో రాకుండా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారని అన్నారు.  జిల్లావ్యాప్తంగా ఒక లక్ష 87 వేల మంది 5 సంవత్సరాలలోపు పిల్లలను గుర్తించడం జరిగిందని తెలిపారు. సుమారు రెండు వేలకు పైగా బూత్ లను ఏర్పాటు చేసి  5 వేలకు పైగా సిబ్బంది ఈనెల10న పోలియో చుక్కల  కార్యక్రమంలో పాల్గొంటున్నారన్నారు. 10న ఏర్పాటుచేసిన బూత్ లతోపాటు 11,  12 తేదీలలో ఇంటింటికి తిరిగి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరికి పోలియో చుక్కలు వేసేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు.  తల్లిదండ్రులు ఈ విషయంలో  తమ పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని కోరారు. ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉండే చోట, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో కూడా పోలియో చుక్కల బూత్ లను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ర్యాలీ లో  జిల్లా వైద్యశాఖ అధికారి  సుదర్శనం, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, నర్సింగ్ విద్యార్థులు,  వైద్య శాఖ సిబ్బంది, అధికారులు, తదితరులు పాల్గొన్నారు

జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న కలెక్టర్‌‌

ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్‌‌, వైద్యశాఖ అధికారులు

ర్యాలీలో పాల్గొన్న ఏఎన్‌‌ఎంలు


ర్యాలీలో పాల్గొన్నఆశావర్కర్లు, అంగన్‌‌వాడీ కార్యకర్తలు
 


No comments:

Post a Comment