Saturday, 9 March 2019

ఇంటర్‌‌ పరీక్షల్లో 989 మంది గైర్హాజరు

‒ ఒకరిపై మాల్‌‌ప్రాక్టీస్‌‌ కేసు 
 
శనివారం జరిగిన ఇంటర్‌‌ మొదటి సంవత్సరం పరీక్షకు 989 మంది గైర్హాజరు కాగా ఒకరు మాల్‌‌ప్రాక్టీసు కింద పట్టుబడ్డారని ఇంటర్మీడియట్‌‌ విద్యాధికారి దాసరి ఓడ్డెన్న తెలిపారు. శనివారం నిర్వహించిన మొదటి సంవత్సరం ఫిజిక్స్‌‌, ఎకనామిక్స్‌‌, వొకేషనల్‌‌ పరీక్షలకు మొత్తం 21,014 మంది విద్యార్థులకు గాను 20,025 మంది హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. జనరల్‌‌ విద్యార్థులు 18,799 మందికి గాను 18,050 మంది హాజరు కాగా, 749 మంది గైర్హాజరయ్యారన్నారు. ఒకేషనల్‌‌ విద్యార్ధులు 2,215 మందికి గాను 1975 మంది హాజరు కాగా, 240 మంది గైర్హాజరయ్యారన్నారు. బోధన్‌‌ ప్రభుత్వ జూనియర్‌‌ కళాశాలలో ఒక విద్యార్థి చీటీలు రాస్తూ పట్టుబడగా అతనిపై మాల్‌‌ప్రాక్టీసు కేసు నమోదు చేశామని చెప్పారు.  జిల్లా తనిఖీ బృందాలు మొత్తం 23 పరీక్షా కేంద్రాలలో తనిఖీ చేసి పరీక్షల నిర్వహణ, ఇబ్బందులను పరిశీలించామన్నారు.  ఈ తనిఖీలలో డీఈసీ సభ్యులు చిరంజీవి, శివాజి, గంగారాం, హెచ్‌‌పీసీ  కమిటి సభ్యులు సుఖేందర్‌‌రెడ్డి,  ఫ్లయింగ్‌‌ స్క్వాడ్‌‌ బృందాలు, సిట్టింగ్‌‌ స్క్వాడ్‌‌ బృందాలు పాల్గొన్నాయని వివరించారు.  

No comments:

Post a Comment