Thursday, 14 March 2019

17న వారియర్స్‌‌ డిఫెన్స్‌‌ అకాడమి ఉచిత గ్రాండ్‌‌ టెస్ట్‌‌


 నిజామాబాద్‌‌:   శరీరదారుఢ్య పరీక్షలలో క్వాలిఫై అయిన ఎస్‌‌.ఐ, కానిస్టేబుల్‌‌ అభ్యర్థులకు మెయిన్‌‌ పరీక్ష కోసం ఈనెల 17న వారియర్స్‌‌ డిఫెన్స్‌‌ అకాడమి ఆద్వర్యంలో ఉచిత గ్రాండ్‌‌ టెస్ట్‌‌ నిర్వహించనున్నామని సంస్థ డైరెక్టర్‌‌ ఎం.రమాకాంత్‌‌ తెలిపారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలోని ప్రెస్‌‌క్లబ్‌‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గ్రాండ్‌‌ టెస్ట్‌‌లోని ప్రశ్నాపత్రాలు నిపుణుల ఆధ్వర్యంలో తయారుచేయడం జరిగిందని, ఇది అభ్యర్థులకు మెయిన్స్‌‌ పరీక్షలో అన్ని విధాలుగా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ గ్రాండ్‌‌ టెస్ట్‌‌లోపాల్గొనాలనుకొనే అభ్యర్థులు ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదని, పరీక్ష రాయాలనుకొనే అభ్యర్థులు 98480 86329,  9491006326 నెంబర్‌‌కు ఫోన్‌‌చేసి రిజిస్ట్రేషన్‌‌ చేసుకోవాలని ఆయన సూచించారు. నిజామాబాద్‌‌ జిల్లా కేంద్రంలోని కేర్‌ ‌డిగ్రీ కళాశాలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందని, పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అరగంట ముందుగానే పరీక్షాకేంద్రంలో రిపోర్ట్‌‌ చేయాలని ఆయన కోరారు.   ఇప్పటికి వరకు జరిగిన ఫిజికల్‌‌ ఈవెంట్స్‌‌లో 95 శాతానికి పైగా మా అకాడమిలో శిక్షణ పొందిన అభ్యర్థులు ఎంపికయ్యారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.  ఈ సమావేశంలో ఇందూర్‌‌ ప్రజాసేన అధ్యక్షుడు కిషోర్‌‌ తివారి, పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.







No comments:

Post a Comment