Thursday, 21 February 2019

అందరి వారు.. కేసీఆర్‌‌ సారు

నిజామాబాద్‌‌ అర్భన్‌‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌‌ గుప్త

నిజామాబాద్‌‌ వార్త: పుట్టిన బిడ్డ మొదలు, వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి కోసం అనేక సంక్షేమ పథకాలు రూపొందించిన అందరివారు మన కేసీఆర్‌‌ సారు అని నిజామాబాద్‌‌ అర్భన్‌‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌‌ గుప్త అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌‌ గాంధీ ఆడిటోరియంలో  జరిగిన షాదీ ముభారక్‌‌, కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఆడ బిడ్డ గర్భం దాల్చింది మొదలు బాలింతను నయా పైసా ఖర్చులేకుండా ఏసీ వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేందకు ‘అమ్మ ఒడి’ పథకంతో కేసీఆర్‌‌ అండగా నిలిచారన్నారు. పుట్టిన బిడ్డ ఆరోగ్యం కోసం ‘కేసీఆర్‌‌ కిట్టు’, బిడ్డ పెద్దయ్యాక వారి చదువు భారం మోసే భారాన్ని తన భుజాలపైన వేసుకొని మైనారిటీ, బిసి గురుకుల పాఠశాలలు, కేజీ టు పీజీ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు.  బిడ్డ చదువుకొని పెళ్లీడుకు రాగానే బిడ్డ పెళ్లి ఎలా చేయాలోనని బాధపడే తల్లిదండ్రులకు ఇంటి పెద్దకొడుకుగా మారి ‘షాదీ ముభారక్‌’, ‘కళ్యాణ లక్ష్మి’ పథకాలను ప్రవేశపెట్టి అండగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. రూ.50000 వేల నుంచి 70 వేలకు అవి కూడా  సరిపోవడం లేదని  ఒక లక్షా నూట పదహార్లు  అందజేసిన మొట్టమొదటి సీఎం మన కేసీఆర్‌‌ అని ఆయన కొనియాడారు. నగరంలో మొత్తం 202 కుటుంబాలకు రూ.2,02,23,432.00 లను అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే వృద్ధులకు, వితంతువులకు, బీడీకార్మికులకు రూ.1000 పింఛన్‌‌ను రూ.2116కు పెంచారని, వికలాంగుల పింఛన్‌‌ను రూ.1500 నుంచి రూ.3116కు పెంచారని ఆయన వివరించారు.
కార్యక్రమంలో మేయర్‌‌ ఆకుల సుజాత, ఫ్లోర్‌‌ లీడర్‌‌ ఎనుగందుల మురళి, కార్పొరేటర్లు దారం సాయిలు, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
No comments:

Post a Comment