Friday, 22 February 2019

కోడి రామకృష్ణ ప్రత్యేక ఇంటర్వ్యూ

కోడి రామకృష్ణ ప్రత్యేక ఇంటర్వ్యూ


దర్శుకుడు కోడి రామకృష్ణ మృతి పట్ల సంతాపం తెలిపిన యాక్షన్ కింగ్ అర్జున్

దర్శుకుడు కోడి రామకృష్ణ మృతి పట్ల సంతాపం తెలిపిన యాక్షన్ కింగ్ అర్జున్


కోడి రామకృష్ణ భౌతికకాయాన్ని సందర్శించిన ప్రముఖులు

దర్శకుడు కోడి రామకృష్ణ ఇక లేదు. అతను 100 సినిమాలకు పైన దర్శకత్వం వహించాడు. అతను ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. అతను పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకోల్లూలో జన్మించాడు. 

బరువెక్కిన గుండెతో భావోద్వేగానికి లోనైనా చిరంజీవి

దర్శకుడు కోడి రామకృష్ణ ఇక లేదు. అతను 100 సినిమాలకు పైన దర్శకత్వం వహించాడు. అతను ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. అతను పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకోల్లూలో జన్మించాడు.

ద ర్శకుడు కోడి రామకృష్ణ సినిమా ప్రస్థానం గురుంచి స్పెషల్ రిపోర్ట్

దర్శకుడు కోడి రామకృష్ణ ఇక లేదు. అతను 100 సినిమాలకు పైన దర్శకత్వం వహించాడు. అతను ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. అతను పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకోల్లూలో జన్మించాడు.ద ర్శకుడు కోడి రామకృష్ణ సినిమా ప్రస్థానం గురుంచి స్పెషల్ రిపోర్ట్.


ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మృతి

దర్శకుడు కోడి రామకృష్ణ ఇక లేదు. అతను 100 సినిమాలకు పైన దర్శకత్వం వహించాడు. అతను  ఆరోగ్య సమస్యలతో  చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.  అతను పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకోల్లూలో జన్మించాడు.


యన్‌.టి.ఆర్‌ మహానాయకుడు రివ్యూ

టైటిల్ : యన్‌.టి.ఆర్‌ మహానాయకుడు
జానర్ : పొలిటికల్‌ డ్రామా
తారాగణం : నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి రానా, విద్యాబాలన్‌, సచిన్‌ కేద్కర్‌ తదితరులు
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
దర్శకత్వం : క్రిష్‌ జాగర్లమూడి
నిర్మాత : బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి

నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి నటించిన ‘యన్‌టిఆర్‌ కథానాయకుడు’ దారుణ పరాజయం కావడంతో.. రెండో భాగం ‘మహానాయకుడు’పై ఆ ప్రభావం పడింది. భారీ తారాగణం, టాప్‌ టెక్నీషియన్స్‌ ఉన్నా.. ఈ మూవీపై అంచనాలు మాత్రం క్రియేట్‌ చేయలేకపోయారు. ప్రస్తుతం ప్రీ రిలీజ్‌ బిజినెస్‌, అడ్వాన్స్‌ బుకింగ్స్‌ను పరిశీలిస్తే .. ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో సైతం ఆసక్తి లేనట్టు కనబడుతోంది. మరి ఇలాంటి పరిస్థితిలో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘యన్‌టిఆర్‌ మహానాయకుడు’ ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.కథ
మొదటి భాగంలో చూపించని ఎన్టీఆర్‌ బాల్యం, బసవ తారకంతో వివాహాన్ని చూపిస్తూ.. మళ్లీ కథానాయకుడు సినిమాను గుర్తు చేస్తూ.. తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టే చోట మొదటి భాగాన్ని ముగించగా అక్కడి నుంచే మహానాయకుడు మొదలవుతుంది. (సాక్షి రివ్యూస్‌) తన పార్టీకి సంబంధించిన చిహ్నాన్ని రూపొందిస్తూ.. రెండో భాగం ప్రారంభం కాగా.. తన రాజకీయ ప్రచారం.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం.. నాదెండ్ల భాస్కర్‌ రావు ఘటనతో ఫస్ట్‌ హాఫ్‌ను ముగించగా.. ఎన్టీఆర్‌ ఢిల్లీ వెళ్లడం.. రాష్ట్రపతిని కలవడం.. మళ్లీ తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం.. ఇక చివరగా బసవ తారకం మరణించడంతో.. సినిమాను ముగించేశారు.నటీనటులు
తొలిభాగంలోనే ఎన్టీఆర్‌గా నటించిన బాలయ్యపై విమర్శలు వచ్చాయి. అయితే ఈ సారి పూర్తి రాజకీయ నేపథ్యంలో సాగగా.. బాలయ్య వయసుకు తగ్గ పాత్ర కావడంతో.. ‘ఎన్టీఆర్‌’లా బాగానే నటించాడు. మరీ ఎన్టీఆర్‌ను మరిపించేంతగా కాకపోయినా.. అసెంబ్లీలో ఎన్టీఆర్‌ను అవమానపరిచే సన్నివేశాల్లో బాలయ్య తన నటనతో మెప్పించాడు. (సాక్షి రివ్యూస్‌) ఇక బాలయ్య తరువాత చెప్పుకోవాల్సిన పాత్ర విద్యాబాలన్‌దే అవుతుంది. బసవతారకం పాత్రలో ఆమె నటించిన తీరు కథానాయకుడు సినిమాలో చూసేశాం. మహానాయకుడులో కూడా బసవతారకం పాత్రలో విద్యాబాలన్‌ మరోసారి మెప్పించారు. ఇక వీరిద్దరిని మినహాయిస్తే.. చంద్రబాబు పాత్రలో రానా, నాదెండ్ల భాస్కర్‌రావు పాత్రలో సచిన్‌ కేద్కర్‌లు ఆకట్టుకున్నారు. మిగతా పాత్రలు తమ పరిధి మేరకు నటించారు.విశ్లేషణ
యన్‌టిఆర్‌ సినీ జీవితం పూల పాన్పులా గడిచిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆయన రాజకీయ అరంగేట్రం.. సాధించిన విజయం.. అటుపై నాదేండ్ల వ్యవహారం.. మళ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం.. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్‌ జీవితంలోకి రావడం.. మళ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించడం.. అటుపై ‘వెన్నుపోటు’  ఘటన చోటుచేసుకోవడం.. ఇక చివరి క్షణాల్లో ఎన్టీఆర్‌ క్షోభ పడటం.. ఎన్టీఆర్‌ స్వర్గస్తులు కావడం.. స్థూలంగా చెప్పాలంటే ఇదే ఎన్టీఆర్‌ జీవితం. (సాక్షి రివ్యూస్‌) అయితే ఇవన్నీ ఉన్నది ఉన్నట్లు తీసే సాహసం బాలయ్య ఎలాగూ చేయలేడు. అలా చేయలేకే బయోపిక్‌ ముసుగులో తమకు నచ్చింది.. మెచ్చింది మాత్రమే తీసి.. కథానాయకుడుతో చేతులు కాల్చుకున్నారు. ఇక ఎన్టీఆర్‌ రాజ​కీయ జీవితానికి సంబంధించిన మహానాయకుడు మీద సగటు ప్రేక్షకుడికి కూడా ఎలాంటి ఆసక్తి  లేదంటేనే.. ఈ చిత్రాన్ని బాలయ్య ఏవిధంగా తీసి ఉంటాడో ఓ అంచనాకు వచ్చేశారని అర్థమవుతోంది.అందరూ అనుకున్నట్లే.. ఎన్టీఆర్‌ జీవితాన్ని మొత్తం చూపించకుండా అసంపూర్తిగా వదిలేశారు. బసవతారకం పాత్రతో సినిమాను చెప్పిస్తూ.. ఆమె మరణంతో మహానాయకుడును ముగించారు. అయితే ఎన్టీఆర్‌ చివరి ఘట్టం జోలికి పోకుండా నాదెండ్లను విలన్‌గా చూపెట్టి మహానాయకుడు సినిమాను చుట్టేశారు. నాదెండ్ల వ్యవహారంలో బాబు కీలకపాత్ర పోషించి ప్రజాస్వామ్యాన్ని, ఎన్టీఆర్‌ను, టీడీపీని రక్షించినట్లు.. చంద్రబాబే అసలు హీరో అన్నట్లు చూపించారు. ఇక సినిమాలో అక్కడక్కడా భావోద్వేగాలు బాగానే పండాయి. (సాక్షి రివ్యూస్‌) కీరవాణి తన నేపథ్య సంగీతంతోనే కొన్ని సన్నివేశాలు ఎలివేట్‌ చేశారు. మాటల రచయితగా సాయి మాధమ్‌ బుర్రా మరోసారి తన కలానికి పదును పెట్టారు. దారి కొత్తదే అయినా.. ఒక్కసారి అడుగు వేశాక.. దారి మన కిందే ఉండాలిగా లాంటి మాటలు ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్‌, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు అన్ని బాగానే కుదిరాయి. ప్రస్తుతం చంద్రబాబు వెన్నుపోటు అంశంపై చర్చలు జరుగుతుండటంతో.. మహానాయకుడులో చూపిన కథ ప్రేక్షకులను అంతగా మెప్పించడం కష్టమే. అయితే ఎన్టీఆర్‌ మిగిలిన జీవితాన్ని కూడా తెలుసుకోవాలంటే.. వర్మ తీసిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ను చూడాల్సిందే. మహానాయకుడులో నాదెండ్ల వ్యవహారం కీ రోల్‌ కాగా.. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌లో చంద్రబాబు వెన్నుపోటు అంశం కీలకం కానుంది. ఈ మూడు చిత్రాలతో తెరపై ఎన్టీఆర్‌ జీవితగాథ సంపూర్ణంగా చూసినట్టవుతుంది.

ప్లస్‌ పాయింట్స్‌ :
కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌
సంగీతం

మైనస్‌ పాయింట్స్‌ :
సెకండాఫ్‌ సాగదీత
అసంపూర్తి కథ


Thursday, 21 February 2019

అందరి వారు.. కేసీఆర్‌‌ సారు

నిజామాబాద్‌‌ అర్భన్‌‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌‌ గుప్త

నిజామాబాద్‌‌ వార్త: పుట్టిన బిడ్డ మొదలు, వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి కోసం అనేక సంక్షేమ పథకాలు రూపొందించిన అందరివారు మన కేసీఆర్‌‌ సారు అని నిజామాబాద్‌‌ అర్భన్‌‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌‌ గుప్త అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌‌ గాంధీ ఆడిటోరియంలో  జరిగిన షాదీ ముభారక్‌‌, కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఆడ బిడ్డ గర్భం దాల్చింది మొదలు బాలింతను నయా పైసా ఖర్చులేకుండా ఏసీ వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేందకు ‘అమ్మ ఒడి’ పథకంతో కేసీఆర్‌‌ అండగా నిలిచారన్నారు. పుట్టిన బిడ్డ ఆరోగ్యం కోసం ‘కేసీఆర్‌‌ కిట్టు’, బిడ్డ పెద్దయ్యాక వారి చదువు భారం మోసే భారాన్ని తన భుజాలపైన వేసుకొని మైనారిటీ, బిసి గురుకుల పాఠశాలలు, కేజీ టు పీజీ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు.  బిడ్డ చదువుకొని పెళ్లీడుకు రాగానే బిడ్డ పెళ్లి ఎలా చేయాలోనని బాధపడే తల్లిదండ్రులకు ఇంటి పెద్దకొడుకుగా మారి ‘షాదీ ముభారక్‌’, ‘కళ్యాణ లక్ష్మి’ పథకాలను ప్రవేశపెట్టి అండగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. రూ.50000 వేల నుంచి 70 వేలకు అవి కూడా  సరిపోవడం లేదని  ఒక లక్షా నూట పదహార్లు  అందజేసిన మొట్టమొదటి సీఎం మన కేసీఆర్‌‌ అని ఆయన కొనియాడారు. నగరంలో మొత్తం 202 కుటుంబాలకు రూ.2,02,23,432.00 లను అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే వృద్ధులకు, వితంతువులకు, బీడీకార్మికులకు రూ.1000 పింఛన్‌‌ను రూ.2116కు పెంచారని, వికలాంగుల పింఛన్‌‌ను రూ.1500 నుంచి రూ.3116కు పెంచారని ఆయన వివరించారు.
కార్యక్రమంలో మేయర్‌‌ ఆకుల సుజాత, ఫ్లోర్‌‌ లీడర్‌‌ ఎనుగందుల మురళి, కార్పొరేటర్లు దారం సాయిలు, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
Tuesday, 19 February 2019

టీయుడబ్ల్యుజె అధ్యక్షుడిగా శేఖర్

* 50 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవం 

నిజామాబాదు వార్త :  తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె) రాష్ట్ర అధ్యక్షుడితో పాటు 50మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి బి.ఎస్.రామకృష్ణ సోమవారం నాడు ప్రకటించారు. ఇందులోభాగంగానే ఆంధ్రజ్యోతి కరీంనగర్ ఎడిషన్ బ్యూరో చీఫ్ నగునూరి శేఖర్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆయన తెలిపారు. ఎన్నికల షెడ్యూలు ప్రకారం నామినేషన్ల స్క్రూటని, ఉపసంహరణల ప్రక్రియ పూర్తయిందని, అధ్యక్ష పదవికి ఒకే ఒక నామినేషన్ మాత్రమే దాఖలైందని, అలాగే 50 రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల పదవులకు 50 నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎస్ఆర్ఓ రామకృష్ణ ప్రకటించారు. ఇదిలావుండగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటు ఇతర కార్యవర్గాన్ని త్వరలో జరిగే రాష్ట్ర మహాసభలో ఎన్నుకోవాల్సి ఉంది. కాగా, టీయుడబ్ల్యుజె రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన నగునూరి శేఖర్ ను సోమవారం నాడు బషీర్ బాగ్ లోని యూనియన్ కార్యాలయంలో జరిగిన ఓ సమావేశంలో ఐజేయు అధ్యక్షులు దేవులపల్లి అమర్, టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు మాజీద్, పిసిఐ మాజీ సభ్యులు అమర్ నాథ్, ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు కల్లూరి సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు దొంతు రమేష్, మహిపాల్ రెడ్డి, రాజేష్, వెలిజల చంద్రశేఖర్, హెచ్ యు జె నాయకులు శిగా శంకర్ గౌడ్, సుధాకర్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మోతె వెంకట్ రెడ్డి తదితరులు అభినందించారు. అలాగే ఏకగ్రీవంగా ఎన్నికైన 50మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యులకు వారు శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ మంత్రులకు శాఖలు కేటాయింపు

నిజామాబాదు వార్త: ఈటెల రాజేందర్‌కు వైద్య ఆరోగ్యశాఖ
వేముల ప్రశాంత్‌ రెడ్డికి రోడ్లు భవనాలు-రవాణాశాఖ శాసన సభా వ్యవహారాలు
కొప్పుల ఈశ్వర్‌కు సంక్షేమశాఖ
జగదీశ్‌రెడ్డికి విద్యాశాఖ
చామకూర మల్లారెడ్డికి కార్మిక శాఖ
నిరంజన్‌రెడ్డికి వ్యవసాయశాఖ
తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు పశుసంవర్థక శాఖ
ఎర్రబెల్లి దయాకర్‌రావుకు పంచా యతీరాజ్‌శాఖ
ఇంద్రకరణ్‌రెడ్డికి న్యాయ, అటవీ, దేవాదాయశాఖ
శ్రీనివాస్‌గౌడ్‌కు ఎక్సైజ్‌, క్రీడలు, యువజన సర్వీసులు, టూరిజం
సీఎం కేసీఆర్ దగ్గరే ఆర్థిక, ఇరిగేషన్, ఐటీ, మున్సిపల్ శాఖలు

Sunday, 17 February 2019

మాజీ మేయర్ సంజయ్ నివాసంలో కెసిఆర్ జన్మదిన వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని నిజామాబాదు నగర తొలి మేయర్ ధర్మపురి సంజయ్ నివాసంలో అనాధ పిల్లలకు అన్నదానం, మరియు మొక్కల పంపిణి కార్యక్రమం నిర్వహించారు. ఆనంద నిలయంలోని 100 మంది పిల్లలు సంజయ్ ఇంటి ఆవరణలోని పార్కులో సంతోషంగా గడిపారు. ఈ సందర్భంగా నిజామాబాదు నగర తొలి మేయర్  సంజయ్ మాట్లాడుతూ కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆనందనిలయం పిల్లలతో కలిసి భోజనం చేయడం,  సరదాగా గడపడం ఎంతో   సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు.  కెసిఆర్ గారికి ఆ దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని  వేడుకొంటున్నానని అయన పేర్కొన్నారు.


మాజీ మేయర్ సంజయ్ ఇంట్లో కెసిఆర్ జన్మదిన వేడుకలు

నిజామాబాదు వార్త: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని నిజామాబాదు నగర తొలి మేయర్ ధర్మపురి సంజయ్ నివాసంలో అనాధ పిల్లలకు అన్నదానం, మరియు మొక్కల పంపిణి కార్యక్రమం నిర్వహించారు. ఆనంద నిలయంలోని 100 మంది పిల్లలు సంజయ్ ఇంటి ఆవరణలోని పార్కులో సంతోషంగా గడిపారు. ఈ సందర్భంగా నిజామాబాదు నగర తొలి మేయర్  సంజయ్ మాట్లాడుతూ కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆనందనిలయం పిల్లలతో కలిసి భోజనం చేయడం,  సరదాగా గడపడం ఎంతో   సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు.  కెసిఆర్ గారికి ఆ దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని  వేడుకొంటున్నానని అయన పేర్కొన్నారు.

మొక్కలు పంపిణి చేస్తున్న మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ 

మొక్కలు పంపిణి చేస్తున్న మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ 

భోజనం వడ్డిస్తున్న  మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ 

ఆనంద నిలయం పిల్లలతో  మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ 

Saturday, 16 February 2019

ఉగ్ర దాడికి నిరసనగా సిపిఎం పార్టీ దిష్టి బొమ్మ దహనం

ఉగ్ర దాడికి నిరసనగా నిజామాబాదు లోని బస్టాండ్ ఎదుట సిపిఎం పార్టీ  నాయకులు, కార్యకర్తలు ఉగ్రవాదుల దిష్టి బొమ్మను  దహనం చేసి, నిరసనను వ్యక్తం చేసారు.


మందుల అధిక ధరలపై పి.ఆర్. సోమాని ఉక్కుపాదం

నిజామాబాదు వార్త: భారతదేశంలో మందుల తయారీ దారులు మందులపై ఇష్టం వచ్చిన రీతిలో ధరలను ముద్రించి 130 కోట్ల భారతీయులను దోచుకొంటున్నారని నిజమాబాద్ ఛాంబర్ అఫ్ కామర్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు పి. ఆర్. సోమాని అన్నారు. అయన నిజామాబాదు లోని హోటల్ కపిలలో శనివారం నిర్వహించిన  ప్రెస్ మీట్లో మాట్లాడారు. పలు కంపెనీలు మందులపై అధిక ధరలను ముద్రించి ప్రజలను ఏవిధంగా మోసం చేస్తున్నాయో సాక్షాదారాలతో సహా వివరించారు. ఈ  విషయంలో ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాడతానని అయన పేర్కొన్నారు. . 

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న
నిజామాబాదు ఛాంబర్ అఫ్ కామర్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు పి.ఆర్. సోమాని 

Sunday, 10 February 2019

శభాష్ ధోని.. జాతీయ జెండా గౌరవం నిలిపాప్ ..!

మైదానంలో ధోని సమయ స్ఫూర్తి గురుంచి ప్రతి ఒక్కరికి తెలిసిందే.. అయితే న్యూజీలాండ్ తో ఆదివారం జరిగిన ఆఖరి టీ 20 మ్యాచ్ లో ఒక వింత సంఘటన చోటుచేసుకొంది. ధోనీ అభిమాని సెక్యూరిటీ కళ్ళు కప్పి ధోనీ వైపు జాతీయ జెండా పట్టుకొని ధోని వైపు వచ్చాడు. అది గమనించిన ధోని అలాగే నిల్చుంది పోయాడు. అభిమాని  ధోని పాదాలను నమస్కరిస్తుండగా అతని చేతిలోని జాతీయ జెండానేలను తాకుతుందని ముందే గమనించిన ధోనీ వెంటనే అభిమాని చేతిలోని భారత జాతీయ జెండాను తన చేతిలోకి తీసుకొని సెక్యూరిటీకి అప్పజెప్పాడు. అభిమానిని బయటకు వెళ్లాల్సిందిగా సూచించాడు. ఈ ఘటనతో ధోని సమయస్ఫూర్తి యావత్ భారతావని కొనియాడుతోంది.


Friday, 8 February 2019

"దేశముదురు"ను మించిన ముదురు" అల్లు అర్జున్ కూతురు నాన్న చెప్పిన వాడ్ని పెళ్లి చేసుకోదట ..!

మన "దేశముదురు" అల్లు అర్జున్ను మించిపోయింది అతని కూతురు అల్లు అర్హ. తాజాగా తన కూతురుతో అల్లు అర్జున్ ఆడుకొంటూ ఓ సరదా వీడియోని పోస్ట్ చేసాడు అల్లు అర్జున్. అందులో అల్లు అర్జున్ తన కూతురుతో నువ్వు నాన్న చెప్పిన వాడ్ని పెళ్లి చేసుకొంటావా... అని అడిగితె.. అందుకు తాను చేసుకోను అంటూ ఎలా ఆటపట్టిస్తుందో మీరే చూడండి..
A post shared by Allu Arjun (@alluarjunonline) on

Wednesday, 6 February 2019

మహిళల మోసం న గాసం .. బిత్తిరి సత్తి కొత్త పథకం

కామెడీ జర్నలిస్ట్ స్టార్ బిత్తిరి సత్తి ఇటీవల కొందరు  ప్రజలను మోసం చేసిన  విధానం గురుంచి ఉదాహరణగా చూపుతూ చేసిన స్కిట్ అదిరిపోయింది


Monday, 4 February 2019

కేంద్ర బడ్జెట్లో బంపర్ ఆఫర్..రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.6 వేలు

త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగానో లేక మరేంటో గాని కేంద్ర ప్రభుత్వం రైతులకు బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది.. అదేంటో తెలుసుకోవాలంటే One India Youtube channel వారి ఈ వీడియో చూడండి..

మోదీకి నిద్రలేకుండా చేస్తున్న ఆ ముగ్గురు మహిళలు..?

మోదీకి ధీటుగా ఎదుగుతూ .. ప్రజాదరణ పొందుతూ మోదీకి పోటీగా మారిన ఆ ముగ్గురు మహిళలు ఎవ్వరు.. తదితర పూర్తి వివరాలు one india youtube channel vaari  ఈ వీడియో చూసి తెలుసుకోండి..


స్టాంప్స్ వెనుక ధోని ఉంటె జాగ్రత్త.. క్రికెటర్స్ కి ఐసీసీ హెచ్చరిక

స్టంప్స్ వెనకాల చిరుతల కదలాడే మన ధోని .. గురుంచి ఐసీసీ తాజాగా ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేసింది.. అదేమిటో one india  youtube channel వారి  ఈ వీడియో చూసి తెలుసుకోండి..


మంగళవారం ఈ రంగు దుస్తులు ధరిస్తే.. అన్నీ శుభాలే..!!

మంగళవారం ఈ రంగు దుస్తులు ధరిస్తే అన్నీ శుభాలే జరుగుతాయని... అలాగే ఈ రంగు దుస్తులు ధరిస్తే అన్నీ అశుభాలు జరుగుతాయని jkr jayam tv  యూట్యూబ్ ఛానల్ జ్యోతిష్య రత్న.. బ్రహ్మశ్రీ డా. JKR గారు ఇలా చెబుతున్నారు..


మాఘమాసంలో ఇవి దానం ఇస్తే.. ఏది కోరితే అది తీరుతుంది

మాఘమాసంలో ఇవి దానం ఇస్తే.. ఏది కోరితే అది జరిగి ఐశ్వర్య వాంతులు అవుతారు అని jkr jayam tv  యూట్యూబ్ ఛానల్ జ్యోతిష్య రత్న.. బ్రహ్మశ్రీ డా. JKR గారు ఇలా చెబుతున్నారు..


Teacher Eligibility Test (టెట్)కు సంబందించిన పూర్తి వివరాలు

టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)కు సంబందించిన పూర్తి వివరాలు అంటే.. టెట్ పరీక్ష ఎవరికోసం? టెట్ పేపర్ -1, పేపర్-2 రాయడానికి ఏ అర్హతలుండాలి? తదితర పూర్తి వివరాలను egurum యూట్యూబ్ ఛానల్ వారి ఈ వీడియో చూసి తెలుసుకోండి..


నిరుద్యోగులకు శుభవార్త..!!

నిరుద్యోగులకు శుభవార్త..!! ప్రభుత్వం నుంచి గ్రూప్ 1, 2, 3 నియామకాలకు ఫి కోచింగ్, ఫ్రీ బుక్స్ కొరకు ఏవిధంగా దరఖాస్తు చేసుకోవాలో ఈ వీడియో చూసి తెలుసుకోండి..


MLC ఓటర్ లిస్టులో మీ పేరు ఉందొ.. లేదో .. ఈ విధంగా తెలుసుకోండి.. !!

MLC ఓటర్ లిస్ట్ ను ఏవిధంగా డౌన్లోడ్ చేసుకోవాలో..? అలాగే.. MLC ఓటర్ లిస్టులో మీ పేరు ఉందొ.. లేదో ..  ఏ విధంగా తెలుసుకోవాలో ఈ వీడియో చూసి తెలుసుకోండి..


గెలవాలనుకొనే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన జీవిత సత్యాలు

"voice of telugu" మోటివేషనల్ వీడియోస్ కోసం చూసే వారికి, జీవితం విలువ తెలుసుకోవాలనుకొనేవారికి, జీవితంలో పైకి రావాలనుకొనేవారికి,  జీవితాన్ని జయించాలనుకొనేవారికి, జీవితంలో ఓడిపోయిన వారికి తిరిగి గెలుపొందే శక్తినిచ్చేది నాకు తెలిసి యూట్యూబ్ లో  ఇంతకంటే మంచి ఛానల్ లేదు. సో ఫ్రెండ్స్ మంచి విషయాలను నలుగురికి షేర్ చేసి అందరికి మంచిని పంచుదాం...

ఈ రోజు వీడియోలో గెలవాలనుకొనే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన జీవిత సత్యాలు గురుంచి తెలుసుకొందాం..


2070 లో ప్రపంచం ఎలా ఉండబోతోందో తెలుసా..?

2070 లో ప్రపంచం ఎలా ఉండబోతోందో తెలుసా..?  ఈ వీడియో చూడండి మీకే తెలుస్తుంది.
విక్రమ్ ఆదిత్య 2070లో ప్రపంచం ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో చాలా చాల బాగా వివరించారు. మరెందుకు ఆలస్యం వెంటనే ఈ వీడియో చూసెయ్యండి...


చివరి సారిగా ఎస్పీ బాలసుబ్రమణ్యం మాతృమూర్తి ఏమన్నారో మీరే చూడండి.. !!

ప్రముఖ నేపథ్య గాయకుడూ ఎస్పీ బాలసుబ్రమణ్యం మాతృమూర్తి సోమవారం ఉదయం కన్ను మూశారు. బాలసుబ్రమణ్యం పుట్టినరోజు సందర్భంగా ఆమె చివరిసారి ఆమె మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీ కోసం..

ఎస్పీ బాలు కుటుంబంలో విషాదం | sp balasubramaniam mother passed away |

ఎస్పీ బాలసుబ్రమణ్యం మాతృమూర్తి నేడు అనగా date: 04-02-2019 సోమవారం ఉదయం మరణించారు.