Tuesday, 29 January 2019

దుమ్ము రేపుతున్న "పాపా .. అత్తిలి పాపా నీకెదంటే ఇష్టం సాంగ్ ..!!

రాయ్ లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న " where is the వెంకట లక్ష్మి" సినిమాలోని "పాపా .. అత్తిలి పాపా  నీకెదంటే ఇష్టం సాంగ్ .. యూత్ ను బాగా ఆకట్టుకొంటూ .. దుమ్మురేపుతోంది.  చిత్ర బృందం మంగళవారం  ఈ పాటను రిలీజ్ చేసారు.


Sunday, 27 January 2019

Ghungat - Sapna chowdary latest video song

హర్యానా ఫేమస్ డాన్సర్ సప్నా చౌదరి "ghungat" లేటెస్ట్ వీడియో సాంగ్ ..

వెలుగు తెలుగు దినపత్రిక ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు

వెలుగు తెలుగు దినపత్రిక ఆధ్వర్యంలో తెలంగాణలోని ఎంపిక చేసిన జిల్లాల్లో  క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో బిత్తిరి సత్తి స్కిట్ .. ఈ పోటీలలో గెలుపొందిన విన్నింగ్ టీంకు లక్ష రూపాయలు, రన్నర్ టీంకు రూ. 50,000 ఇవ్వనున్నారు.


తనపై పెట్టిన కేసుపై స్పందించిన భానుప్రియ

ఇటీవల తన కూతురును వేధిస్తున్నారంటూ భానుప్రియ ఇంట్లో పనిమనిషిగా చేస్తున్న అమ్మాయి తల్లి పోలీసులకు కంప్లైంట్ చేసిన సందర్భంగా భానుప్రియ మీడియా ముందుకు వచ్చి నిజానిజాలను వెల్లడించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి..


Friday, 18 January 2019

ఆర్ట్ ఆఫ్ లివింగ్ పేరిట అసలేం జరుగుతోంది..?

  • మీరు మీ కళ్ళకు గంతలు కడితే చదవగలరా... ?
  • గోడ అవతల ఏముందో చెప్పగలరా..?
  • భవిష్యత్తును ఊహించగలరా..?
  • పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు మీకు ముందుగానే తెలిసిపోతాయా..?
  • ఇదంతా కేవలం రెండు రోజుల్లో ఇచ్చే శిక్షణతో వచ్చేస్తుందంటే మీరు నమ్ముతారా..?
  • ఆర్ట్ ఆఫ్ లివింగ్ పేరిట అసలేం జరుగుతోంది..?
  • తెలుసుకోవాలనుందా..? అయితే ఈ వీడియో చూడండి..


Wednesday, 16 January 2019

నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం సమాచారం


లోక్సభ ఎన్నికలు 2019: నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం గురించి వివరమైన సమాచారం తెలుసుకోండి. ఎన్నికల సమీకరణాల గురించి, ఎంపి, జనాభా, సామాజిక చిత్రం, ప్రస్తుత సిట్టింగ్ ఎంపి పనితీరు, ఎన్నికల ఫలితాల గురించి విజేత, రన్నర్ అప్, ఇంకా నిజామాబాద్పై మరింత సమాచారం.

Sunday, 13 January 2019

జాగృతి సంక్రాంతి ముగ్గుల పోటీలలో విజేతలు వీరే..

నిజామాబాదు వార్త : నిజామాబాదు నగరంలోని కల్లెక్టరేట్ గ్రౌండ్ లో "తెలంగాణ జాగృతి" ఆధ్వర్యంలో నిర్వహించిన "ముగ్గుల పోటీలు" నగర ప్రజలను ఆకట్టుకొన్నాయి. ముగ్గుల పోటీలో  మొదటి బహుమతిని  మంచిప్ప గ్రామానికి చెందిన రెమ్మ నాగలక్ష్మి గెలుపొందగా, రెండవ బహుమతి చంద్రనగర్కు చెందిన రజని, తృతీయ బహుమతిని రేవతి గెలుచుకున్నారు. గెలుపొందిన విజేతలకు నగర మేయర్ ఆకుల సుజాత, జాగృతి జిల్లా బాద్యులు బహుమతులను అందజేశారు.

జాగృతి ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు
బహుమతులు అందజేస్తున్న నగర మేయర్ ఆకుల సుజాత 

ద్వితీయ బహుమతి అందుకొంటున్న  చంద్రనగర్కు చెందిన రజని 

ప్రథమ బహుమతి అందుకొంటున్న  మంచిప్పకు చెందిన రెమ్మ నాగ లక్ష్మి 


తృతీయ బహుమతి అందుకొంటున్న రేవతి 

Saturday, 12 January 2019

TUWJ, IJU నిజామాబాదు జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

నిజామాబాదు వార్త : తెలంగాణ స్టేట్ యూనియన్ అఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ), ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (IJU)  నిజామాబాదు జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొన్నారు.  నిజామాబాదు నగరంలోని బస్వగార్డెన్లో ఆదివారం జరిగిన TUWJ జిల్లా మహాసభలో  tuwj రాష్ట్ర ఉపాధ్యక్షులు కరుణాకర్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికలను నిర్వహించారు.  అధ్యక్షులుగా బొబ్బిలి నర్సయ్య, ప్రధాన కార్యదర్శిగా అంగిరేకుల సాయిలు, ఉపాధ్యక్షులుగా  పులగం దేవిదాస్, పొన్నాల చంద్రశేఖర్, రాథోడ్ వసంత్ రావు, ఎడ్ల సంజీవ్, సంయుక్త కార్యదర్శులుగా  జి.ప్రమోద్ గౌడ్, సిరిగాద బాలరాజు, మండే మోహన్, అబ్దుల్ అజీమ్ పాషా, కోశాధికారిగా సిరిగాధ ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రెటరీలుగా సింగోజి దేవిదాస్, రాజలింగం, వి.రాజేష్, ఎక్సిక్యూటివ్ మెంబర్లుగా జెట్టి గోవింద రాజు,  సురేష్, ఎం.వి. రమణ, రవికుమార్, నారాయణ, రమేష్, మధు, సంతోష్, వేణు, మహేందర్, రాజ్ కుమార్, మురళి, రవిచరణ్, తన్వార్ నర్సయ్య, డి.రవిబాబు, విజయ్ కుమార్, అనిల్ కుమార్, వేణుగోపాల్, బండి నారాయణలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అనంతరం tuwj రాష్ట్ర ఉపాధ్యక్షులు కరుణాకర్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కమిటీ జర్నలిస్ట్ ల సంక్షేమానికి, tuwj పటిష్ఠానికీ కృషి చేయాలని పిలుపు నిచ్చారు. tuwj జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి నర్సయ్య మాట్లాడుతూ తనకు ఈ అవకాశాన్ని ఇచ్చిన జర్నలిస్ట్ సోదరులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలుపుతూ.. TUWJ పటిష్టానికి, జర్నలిస్టుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తానని అన్నారు. tuwj  ప్రతి సభ్యునికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లాలోని tuwj జర్నలిస్టులు పాల్గొన్నారు.

TUWJ జిల్లా మహాసభలో మాట్లాడుతున్న రాష్ట్ర ఉపాధ్యక్షుడు  కరుణాకర్ 

నూతనంగా ఎన్నికైన TUWJ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి నర్సయ్యతో సభ్యులు 

 నూతనంగా ఎన్నికైన TUWJ జిల్లా కమిటీ  సభ్యులు 

tuwj  జిల్లా మహాసభలో పాల్గొన్న జర్నలిస్ట్ లు 

tuwj  జిల్లా మహాసభలో పాల్గొన్న జర్నలిస్ట్ లు 

Friday, 11 January 2019

నాగాబాబు బాలకృష్ణకు అల్టిమేట్ కౌంటర్ _ కామెంట్ నెంబర్-6

నాగాబాబు బాలకృష్ణకు అల్టిమేట్  కౌంటర్ _ కామెంట్ నెంబర్-6
Naga Babu Ultimate Reply to Balakrishna on 6th Comment | Naga Babu Final Words for Balakrishna

వినయ విధేయ రామ ను ముంచుతున్న ఆ 5 సీన్స్.. !

Vinaya Vidheya Rama Disaster
Director Boyapati Missed Logic In These Scenes In Vvr Movie
వినయ విధేయ రామ ను ముంచుతున్న ఆ 5 సీన్స్.. !

Tuesday, 8 January 2019

Endhuku ? Full Song | Lakshmi's NTR Movie Songs | RGV

సెన్సేషనల్ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎన్టీఆర్ బయోపిక్ ను లక్ష్మి"స్ ఎన్టీఆర్ గా  తీస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే  తాజాగా అందులోని ఒక పాటను రిలీస్ చేసారు... అదే.. ఇది..

Sunday, 6 January 2019

కలుషిత ఆహరం తిని 67 మంది విద్యార్థులు అస్వస్థత

నిజామాబాదు వార్త (రంగారెడ్డి): కలుషిత ఆహరం తిని 67 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కస్తూర్బా వసతి గృహంలో  చోటుచేసుకొంది. శనివారం రాత్రి పాఠశాలలోని విద్యార్థులకు నిర్వాహకులు భోజనానికి ముందు ఫ్రూట్ సలాడ్ ఇచ్చి అనంతరం భోజనం పెట్టారు. కొద్ది సేపటికే విద్యార్థులు కడుపు నొప్పితో బాధపడ్డారు. అనంతరం వాంతులు చేసుకోవడంతో విద్యార్థులను వసతిగృహ  సిబ్బంది చేవెళ్ల ప్రభుత్వాస్పత్రికి తరలించగా విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. ఘటన తెలిసిన ఉన్నతాధికారులు, డీఈవో ఆస్పత్రికి చేరుకొని విచారణకు ఆదేశించారు. బాద్యులపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాగా ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు వసతిగృహ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు 

Saturday, 5 January 2019

పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలను అమ్ముకున్నారు.. ఇదే సాక్ష్యం.

పంచాయతీ సెక్రటరీ ఫలితాల్లో అక్రమాల గురుంచి అనేక విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.  ఈ వీడియోలో అభ్యర్థుల ఆవేదనను  బాధను చూడండి.. 

పంచాయతీ సెక్రటరీ ఫలితాల్లో తనకు జరిగిన అన్యాయంపై OC అభ్యర్థి ఆవేదన|

పంచాయతీ సెక్రటరీ ఫలితాల్లో అక్రమాల గురుంచి అనేక విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇది వరకు పోస్టులనుఁ అమ్ముకున్న వీడియో బయటికి రాగా.. తాజాగా ఓకే ఒక అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని యూట్యూబ్ ద్వారా పంచుకొన్నారు.. ఆ వీడియో చూడండి..


పంచాయతీ సెక్రెటరీ జాబులు అమ్ముడు పోయాయి (with proof)

రాత్రనకా.. పగలనక..  అహోరాత్రులు కష్టపడి గంపెడు ఆశతో.. పంచాయతీ సెక్రటరీ పరీక్షలు రాశారు. కానీ కొందరు దళారులు వాటిని అమ్ముకొని కష్టపడి చదివిన నిరుద్యోగులకు తీరని అన్యాయం చేస్తూ వారి పొట్ట కొట్టారు. ఇందుకు సాక్ష్యంగా ఒక వీడియో యూట్యూబ్ లో హల్చల్ చేస్తుంది.. ఈ వీడియో మీ కోసం..


కారును ఢీకొన్న సైకిల్ .. కారుకే డామేజ్ ఎలా..?

సైకిల్ కారును ఢీకొంటే కారు డేమేజ్ కావడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా..? అవునండి .. మీరు విన్నది నిజమే.. చైనాలో ఈ ఘటన చోటు చేసుకోండి. ఇక విషయానికి వస్తే.. చైనాలో ఒకతను సైకిల్ తొక్కుకొంటూ వెళ్లి కారును ఢీకొన్నాడట. .. దీంతో కారు బంపర్ డామేజ్ అయిందట. ఈ ప్రమాదంలో సైకిల్ డ్రైవర్ కు స్వల్ప గాయాలు కాగా.. కారు డ్రైవెర్కు గాయాలేమి కాలేదట. అయితే ఈ వీడియో మరియు ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరి ఆ వీడియోను మీరే చూడండి.. 

Wednesday, 2 January 2019

అఖిల్ మిస్టర్ మజ్ను టీజర్

అఖిల్ మరో సారి హీరోగా ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతకు ముందు అతడు నటించిన సినిమాలు అంతగా హిట్ కాలేదు. తాజాగా అతను నటిస్తున్న మిస్టర్ మజ్ను టీజర్ ను బుధవారం విడుదల చేసారు. అఖిల్ ఫైట్స్, డాన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకొంటుంది.

Watch the official Telugu Teaser here! Movie - Mr. Majnu Starring - Akhil Akkineni, Nidhhi Agerwal Music - Thaman S Written & Directed by Venky Atluri Dop - George C.Williams Editing - Navin Nooli Art - Avinash Kolla Lyricist - Shreemani Choreography - Sekhar Banner - Sri Venkateswara Cine Chitra LLP Music Label - Sony Music Entertainment India Pvt. Ltd. © 2018 Sony Music Entertainment India Pvt. Ltd.