Tuesday, 4 December 2018

బోధన్ రాకాసిపేట్ టిసిఎస్ కల్లు మాముల నిర్వాహకులపై సీపీకి ఫిర్యాదు | NIZAMABAD VAARTHA |

నిజామాబాదు వార్త : లాభాలను గీత కార్మికులందరికీ పంచుతానని మాట ఇచ్చి బోధన్ టిసిఎస్ కల్లు మామూల చేపట్టిన జి.శివరాజ్, బుర్క శంకర్ గౌడ్, టి.రామగౌడ్ లు లాభాలను పంచకుండా గీత కార్మికులను మోసం చేశారని బోధన్ రాకాసిపేట్ టిసిఎస్ గీత కార్మికులు ఆరోపించారు.  ఈమేరకు వారు మంగళవారం జిల్లా కలెక్టర్, సీపీలకు ఫిర్యాదు అందజేశారు.  అనంతరం నిజామాబాదు లోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2001లో కళ్ళు మామూల చేపట్టిన జి.శివరాజ్, బుర్క శంకర్ గౌడ్, టి.రామగౌడ్ లు  కార్మికులకు న్యాయంగా ఇవ్వాల్సిన కల్లు మామూల లాభాలను ఇవ్వకుండా వారు మాత్రం కోట్ల రూపాయలు సంపాదించారని, వారి ఆస్తులపై దర్యాప్తు జరిపించాలని బోధన్ రాకాసిపేట్ టిసిఎస్ గీత కార్మికులు పి.గంగాధర్ గౌడ్, పి.సిద్దిరామాగౌడ్, టి.సిద్ధగౌడ్, బి.నాగరాజు గౌడ్, షేర్ల రామాగౌడ్ లు కలెక్టర్, సీపీలకు అందజేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

మరిన్ని తాజా సరికొత్త వార్తల కోసం క్రింది లింక్ ని క్లిక్ చేసి మా యూట్యూబ్ చాన్నెల్ని వీక్షించండి.

నిజామాబాదు వార్త 


No comments:

Post a Comment