Tuesday, 4 December 2018

నగరంలో నేడు పరిపూర్ణానంద స్వామి రోడ్ షో |nizamabad vaartha|

నిజామాబాదు వార్త: నిజామాబాదు నగరంలోని హమాలీవాడి నుంచి మొదలుకొని శివాజీ చౌక్ వరకు పూజ్య పరిపూర్ణానంద స్వామి రోడ్ షో నిర్వహిస్తున్నట్లు నిజామాబాదు అర్బన్ భాజపా అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. మంగళవారం ఆయన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ప్రచారం బుధవారంతో ముగియనున్న సందర్భంగా పరిపూర్ణానంద స్వామి సుడిగాలి పర్యటన చేయనున్నారని ఆయన పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు హమాల్వాడి నుంచి పరిపూర్ణానంద స్వామి రోడ్ షో ప్రారంభమై శివాజీ చౌక్ వరకు కొనసాగుతుందని ఆయన వివరించారు. రోడ్డుషోకు ప్రజలు, కార్యకర్తలు  అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని యెండల పిలుపునిచ్చారు.


మరిన్ని తాజా సరికొత్త వార్తల కోసం క్రింది లింక్ ని క్లిక్ చేసి మా యూట్యూబ్ చాన్నెల్ని వీక్షించండి.

నిజామాబాదు వార్త 


No comments:

Post a Comment