Sunday, 23 December 2018

అభ్యాస లో ఘనంగా శ్రుతమహోత్సవ వేడుకలు

నిజామాబాదు వార్త : నిజామాబాదు నగరంలోని అభ్యాస పాఠశాలలో ఆదివారం శ్రుతమహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సహజ విజ్ఞాన ప్రదర్శనకు బిన్నంగా  తెలుగు, సాంఘికం, గణితం, హిందీ ఇలా అన్ని సబ్జెక్టులతో విజ్ఞాన ప్రదర్శనను నిర్వహించడం అందరిని ఆకట్టుకొంది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చిన్న చెన్న శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ శ్రుత మహోత్సవంలో దాదాపు 93 అంశాలతో కూడిన ప్రాజెక్టులలో  1వ తరగతి మొదలు 10వ తరగతి వరకు విద్యార్థులు పాలుపంచుకున్నారని తెలిపారు. దీని ద్వారా విద్యార్థులలో సృజనాత్మక పరిజ్ఞానం పెంపొందుతుందని, నూతన ఆవిష్కరణలకు నాందిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ పి.శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయురాలు అన్నపూర్ణ, ఇంచార్జిలు మధవి, గిరీష్, సంగీత, ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.


విజ్ఞాన  ప్రదర్శనను  తిలకిస్తున్న ఇంచార్జి మాధవి 

పాఠశాల పేరెంట్స్ కు  విజ్ఞాన ప్రదర్శన  గురించి వివరిస్తున్న 9వ తరగతి విద్యార్థులు 

ఆకట్టుకున్న 10వ తరగతి విద్యార్థుల విజ్ఞాన ప్రదర్శన 

 విజ్ఞాన ప్రదర్శనను  తిలకిస్తున్న పేరెంట్స్


వీడియో కోసం క్రింద వీడియో కు క్లిక్ చేయండి.

No comments:

Post a Comment