Thursday, 13 December 2018

"కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే నేను" ముఖ్యమంత్రిగా కెసిఆర్ ప్రమాణ స్వీకారం

నిజామాబాదు వార్త : తెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రిగా రెండవసారి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రమాణస్వీకారం చేసారు. రాజభవన్ లోని దర్బార్ హాల్లో మధ్యాహ్నం 1.25 గంటలకు సీఎం కేసీఆర్తో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారానికి పెద్ద సంఖ్యలో తెరాస నాయకులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం "జై కెసిఆర్".. "జై తెలంగాణ" నినాదాలతో సభాప్రాంగణం మారుమ్రోగింది.  ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేటీఆర్, హరీష్ రావు, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే  కెసిఆర్  ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు సంతకం చేసారు. కార్యక్రమానికి నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, తెరాస ఎంపీలు, మజ్లీస్ అధినేత  అసదుద్దీన్ ఒవైసి, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. 


No comments:

Post a Comment