Sunday, 9 December 2018

అతి తక్కువ ఖర్చుతో.. అత్యాధునిక వైద్య సేవలు

నిజామాబాదు వార్త: నిజామాబాదు నగరంలోని ఖలీల్ వాడి లో ఆదివారం "అంకం హాస్పిటల్"ను డా.రమాదేవి, చంద్ర శేఖర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్లు జగదీశ్వర్, శివలింగంలు మాట్లాడుతూ.. ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సదుపాయం కలిపించాలనే ఉద్దేశ్యంతో "అంకం హాస్పిటల్"ను ప్రారంభించామని పేర్కొన్నారు. హాస్పిటల్ లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎముకలు, కీళ్లు, మెడ, నడుము నొప్పి, నరములు లాగడం, మాడిమనొప్పులు మరియు కీళ్ల మార్పిడి ఆపరేషన్లు  తదితర వైద్య సేవలు డా. గణేష్ అంకం అందిస్తారని, సంతాన సాఫల్యత గురుంచి ప్రత్యేక చికిత్స, నార్మల్ డెలివరీలు, పెద్దపరేషన్లు, గర్భసంచి సంబంధిత వ్యాధులు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, అన్ని రకాల స్త్రీ సంబంధిత వ్యాధులకు అత్యుత్తమ చికిత్స డా. భానుప్రియ అంకం అందిస్తారని వివరించారు. నిజామాబాదు, కామారెడ్డి  జిల్లాల ప్రజలు తమ వైద్య సేవలు వినియోగించుకోవాల్సిందిగా వారు కోరారు.

ఆపరేషన్ థియేటర్ను ప్రారంభిస్తున్న డా. లక్ష్మారెడ్డి 

డా. గణేష్ అంకం ను అభినందిస్తున్న IMA అధ్యక్ష, కార్యదర్శులు డా. కవితారెడ్డి, డా. సవిత
గైనకాలజి విభాగాన్ని ప్రారంభిస్తున్న డా. భానుప్రియ గణేష్ అంకం 


హాస్పిటల్లో అందుబాటులో ఉండే డాక్టర్లను చూపే ఫ్లెక్స్ 


ఖలీల్ వాడిలో ప్రారంభమైన "అంకం హాస్పిటల్"




No comments:

Post a Comment