Sunday, 23 December 2018

ఘనంగా ఎస్.ఆర్. ప్రైమ్ నిజామాబాదు Annual Day సెలెబ్రేషన్స్

నిజామాబాదు వార్త; నిజామాబాదు నగరం బొర్గం(పి) లోని  ఎస్.ఆర్.ప్రైమ్ హై స్కూల్ పాఠశాలలో Annual Day సెలెబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎస్.ఆర్. విద్యాసంస్థల చైర్మన్ వరదా రెడ్డి పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఆయన మాట్లాడారు. విద్యార్థులు తల్లిదండ్రులు పిల్లలను చదవాలంటూ ఒత్తిడి పెట్టొద్దని, వారికీ అర్థమయ్యేలా చెప్పి.. వారు ఇష్టంగా చదువుకునేలా చూడాలన్నారు. ముఖ్యంగా వారదా రెడ్డి మాట్లాడుతున్నప్పుడు విద్యార్థులు చప్పట్లతో ప్రాంగణం మారుమ్రోగింది. విద్యావ్యవస్థను సునిశితంగా పరిశీలించి, అత్యాధునిక టెక్నాలజీ, సౌకర్యాలతో తమ విద్యాసంస్థలను నెలకొల్పామన్నారు. మిగితా ఎస్.ఆర్. విద్యాసంస్థలతో పోలిస్తే.. నిజామాబాదు బ్రాంచి కాస్త వెనుకబడి ఉందని, విద్యార్థులు బాగా కష్టపడి మంచి పేరు తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమం మధ్యలో బిగ్ బాస్ ఫేమ్ "రోల్ రైడ" ప్రత్యక్షమై అందరిని ఆశ్చర్య పరిచారు. రోల్ రీడ రాకతో ఒక్కసారి సభాప్రాంగణం విద్యార్థులు కేకలు, అరుపులతో దద్దరిల్లింది. ఈ సందర్భంగా రోల్ రైడ మాట్లాడుతూ.. చదువును ఎప్పుడూ నెగ్లెక్ట్ చెయ్యొద్దని, అలాగని మన అభిరుచులను కూడా వొదులుకోవద్దన్నారు. అనంతరం "పతంగ్" "అరుపు" పాటలను పాడి వినిపించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తల్లితండ్రులు పాల్గొన్నారు. 

కార్యక్రమంలో మాట్లాడుతున్న చైర్మన్ వరదా రెడ్డి 

కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు తల్లిదండ్రులు 

కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎస్.ఆర్. ప్రైమ్ నిజామాబాదు  ప్రిన్సిపాల్ అనిల్ రాజ్ 

మాట్లాడుతున్న ఎస్.ఆర్. ప్రైమ్ నిజామాబాదు ఇంచార్జి 

అక్కట్టుకొన్న అన్నమయ్య నృత్యరూపకం 




No comments:

Post a Comment