Monday, 10 December 2018

డిసెంబర్ 9 ప్రత్యేకత |తాను సచ్చుడో, తెలంగాణ వచ్చుడో ఎదో ఒకటి తేలాలన్న కేసీఆర్ |

డిసెంబర్ 9.... తెలంగాణ అస్థిత్వానికి గుర్తింపు లభించిన రోజు. రాష్ట్ర సాధన కోసం ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తరుణంలో కేంద్రం తలదించక తప్పని రోజు. తాను సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అంటూ బక్కపలచని నేత కేసీఆర్ ఆమరణ దీక్ష బలంగా మారి యావత్ దేశాన్ని కదిలించిన రోజు. మా తెలంగాణ మాగ్గావలే అంటూ నినదించిన గొంతులు ఢిల్లీకి సెగలా తగిలాయి. చివరకు తెలంగాణ ఉద్యమం ఉగ్రరూపం దాల్చడంతో యూపీఏ సర్కార్ 2009 డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇటు కేసీఆర్ దీక్ష.. అటు ఢిల్లీలో యూపీఏ ప్రభుత్వం మంతనాలు. చివరకు కేసీఆర్ ఆరోగ్యం క్షీణిస్తున్న వేళ కేంద్రం దిగిరాక తప్పలేదు. 2009 డిసెంబర్ 9న రోజంతా మూడుసార్లు సమావేశమైన కోర్ కమిటీ సాయంత్రానికి ఏమీ తేల్చలేదు. చివరగా నాలుగోసారి భేటీ అయి గంటలకొద్దీ చర్చించి ఆరోజు రాత్రి 11.30 గంటలకు తెలంగాణపై ప్రకటన చేశారు అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం.


No comments:

Post a Comment