Monday, 19 November 2018

యెండలను భారీ మెజారిటీతో గెలిపించాలి : TCA కార్యదర్శి డి.గురువా రెడ్డి

నిజామాబాదు వార్త : నరేంద్ర మోడీ నాయకత్వంలో భాజపా నిజామాబాదు అర్బన్ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణను గెలిపిస్తే యువతకు క్రీడల్లోనూ, ఉపాదిలోనూ అవకాశాలు పెరుగుతాయని, కాబట్టి యెండలను భారీ మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) కార్యదర్శి డి. గురువా రెడ్డి అన్నారు. సోమవారం ఆయన నిజామాబాదు విచ్చేసిన సందర్భంగా పలు అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడైన  యెండల గెలుపు యువత అభివృద్ధి, భవిష్యత్తుకు సోపానమని అన్నారు. ప్రత్యేక రాష్ట్రము ఏర్పడ్డ తర్వాత TCA కు ప్రత్యేక  గుర్తింపు కోసం సుప్రీమ్ కోర్ట్ లో కేసు వేశామని, తీర్పు  డిసెంబర్ లేదా జనవరిలో వస్తుందని,   అలాగే గతంలో 2015, 2017లో నిర్వహించిన తెలంగాణ గోల్డ్ కప్ ఫ్లాగ్షిప్ T20 టోర్నమెంట్ డిసెంబర్లో నిర్వహించనున్నామని, ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా  5 జిల్లాల్లో జరుపబోతున్నామని, ఇందులో లోని ఎంపిక చేయబడ్డ 32 టీంలు పోటీ పడతాయని ఆయన వివరించారు.



No comments:

Post a Comment