Saturday, 24 November 2018

మహిళలను వేధిస్తే శిక్షలు తప్పవు : జిల్లా జడ్జి కె.సుజన

నిజామాబాదు వార్త: నిజామాబాదు నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో శనివారం "మహిళలపై హింస నిర్మూలన" దినోత్సవాన్ని నిజామాబాదు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన జిల్లా జడ్జి కె.సుజన మాట్లాడుతూ మహిళలను ఏవిధంగా వేధించినా  శిక్షలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా ఆడపిల్లలపై లైంగిక వేధింపుల విషయంలో మాట్లాడుతూ తల్లితండ్రులు తమ పిల్లలకు ఏది "good touch, ఏది bad touch" లాంటి విషయాలను విడమర్చి చెప్పాలని పేర్కొన్నారు.  మహిళలపై వేధింపులకు పాల్పడిన వారికి త్వరగానే శిక్షలు పడుతున్నాయని కొన్ని ఉదాహారణలతో వివరించారు. బాధిత మహిళలు భయపడకుండా Dist. Legal Services Authority సెంటర్ ను సంప్రదించాలని సూచించారు. బాధిత మహిళల విషయం చాల గోప్యంగా ఉంచబడుతుందని, కాబట్టి ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. అంతకుముందు Dist. Legal Services Authority, nizamabad సెక్రటరీ సూర్య చంద్రకళ మాట్లాడుతూ మహిళలకు అండగా ఉన్న చట్టాలు, వారికీ అందజేసే పరిహారాలు తదితర విషయాలపై అవగాహన కలిపించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఎస్.కవిత రెడ్డి, సెక్రటరీ కే.సవిత రాణి, సఖి, వన్ స్టాప్ సెంటర్ సిద్దయ్య, IMA డాక్టర్లు, నర్సింగ్ కళాశాల విద్యార్థినులు, తదితరులు పాల్గొన్నారు.


కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా జడ్జి కే.సుజన

మాట్లాడుతున్న DLSA సెక్రటరీ సూర్య చంద్రకళ 

మాట్లాడుతున్న సఖి వన్ స్టాప్ సెంటర్ సిద్దయ్య 

జిల్లా జడ్జికి కరపత్రిక అందజేస్తున్న సిద్దయ్య 

కారపత్రికతో సభాధ్యక్షులు 

కార్యక్రమానికి హాజరైన మహిళలు 
పాల్గొన్న నర్సింగ్ విద్యార్థులు 





No comments:

Post a Comment