Friday, 9 November 2018

పైన పటారం.. లోన లొటారం .. ఇదీ మన నిజామాబాదు ప్రగతిభవన్ పరిస్థితి..!!

అడుగడుగునా చెత్త.. దుమ్ము,.. ధూళి

రోజూ చూస్తున్నా... అధికారులకు ఎవ్వరికీ పట్టని వైనం

ఈ క్రింది చిత్రాలు చూస్తే.. అదేదో మూతబడిన కార్యాలయమని అనుకొంటే మీరు పప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే అది మన నిజామాబాద్ ప్రగతి భవనం. అక్కడ ఉండేది అందరూ జిల్లా స్థాయి అధికారులే... ప్రతి రోజు ఆ చెత్తను.. బూజును చూస్తున్నారే తప్ప ఒక్కరూ పట్టించుకొన్న పాపాన పోలేరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలపెట్టిన స్వచ్ఛభారత్, హరితహారం కార్యక్రమాల్లో పాల్గొని.. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం.. జిల్లాను స్వచ్ఛ జిల్లాగా మారుద్దాం అంటూ స్పీచ్ లు ఇచ్చే అధికారులు తమ కార్యాలయాన్ని మాత్రం పరిశుభ్రంగా ఉంచుకోవడం లేదు. నానా ఇబ్బందులతో కార్యాలయానికి వచ్చే ప్రజలకు కార్యాలయంలో స్వచ్ఛమైన గాలి కూడా పీల్చుకొనే పరిస్థితి లేదు. కనీసం కూర్చోడానికి వేసిన కుర్చీలు కూడా ఏళ్ళ తరబడి మరుగున పడి అలానే ఉన్నాయి. తాగడానికి ఏర్పాటు చేసిన మంచినీటి ట్యాంక్ సైతం బూజు పట్టి పనిచేయని స్థితిలో ఉంది. శుక్రవారం "నిజామాబాదు వార్త" ప్రగతి భవన్ కార్యాలయాన్ని సందర్శించినప్పుడు అక్కడి అపరిశుభ్రతను క్లిక్ మనిపించింది.


- వెంకట్ చింతకింది, నిజామాబాదు వార్త ప్రతినిధి




ఇంకెవరైనా వస్తే నేలపైనే కూర్చోవాలి.. పాడైన కుర్చీలు 

పనికిరాని కుర్చీలు 
Add caption
Add caption
చెత్తను ఊడ్చి కుప్పగా అక్కడే వదిలేసిన దృశ్యం 

బూజు పట్టి రొంప పుట్టించేలా ఉన్న కుర్చీలు 
                                   
ఫ్యూజులు లేని కరెంటు బోర్డులు.. ఒక్క నోటీసు అంటించని నోటీసు బోర్డు
నిరుపయోగంగా ఉన్న మంచినీటి ట్యాంకు 

                                     
                                            గ్రాముల కొద్దీ మీటర్లకు పట్టిన బూజు


                                              


                                                 


                                                










                                     

1 comment: