Thursday, 15 November 2018

కాంగ్రెస్ పార్టీకి అరుణతార రాజీనామా

నిజామాబాదు వార్త: కాంగ్రెస్ లో అసమ్మతి సెగలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తమకు సీట్లు దక్కకపోవడంతో ఆశావహులు తిరుగుబాటు బావుటా ఎగరవేస్తున్నారు. ఈ నేపథ్యములో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణతార కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గురువారం ఆమె కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో తన నిర్ణయాన్ని వెల్లడించారు. జుక్కల్ టికెట్ దక్కకపోవడం తనను ఎంతో బాధకు గురిచేసిందని, అందుకే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ఆమె అన్నారు. ప్రజాసేవకు పాటుపడే వారికి కాకుండా డబ్బులు ఖర్చు చేసే వారికే పార్టీ ప్రాధాన్యత నిస్తోందని, పార్టీ కోసం కష్టపడ్డవారు టికెట్ అడిగితె బయపెడుతున్నారని ఆమె వాపోయారు. మహిళలకు పార్టీలో ప్రాధాన్యత నివ్వడం లేదన్నారు.  కార్యకర్తల అభీష్టం మేరకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. కాగా బాన్సువాడ టికెట్ను ఆశించి భంగపడ్డ మాల్యాద్రి రెడ్డి కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్న విషయం తెలిసిందే.


No comments:

Post a Comment