Friday, 9 November 2018

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన పోలీస్ కమిషనర్


పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్న పోలీస్ కమిషనర్ కార్తికేయ, సిబ్బంది. 

నిజామాబాద్ వార్త: రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని పోలింగ్ కేంద్రాలను  శుక్రవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద తీసుకొంటున్న భద్రతా ఏర్పాట్లను గురుంచి వాకబు చేసి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
 పోలీస్ కమిషనర్ వెంట నిజామాబాదు, ఆర్మూర్ ACPలు జి.శ్రీనివాస్ కుమార్, ఎ. రాములు, టౌన్ సి.ఐ. నరేష్, ఆర్మూర్ ఎస్.హెచ్.ఓ. పి.రాఘవేందర్, 3వ ఠాణా ఎస్.ఐ. కృష్ణ లు ఉన్నారు. 

No comments:

Post a Comment