Wednesday, 21 November 2018

గెలిపిస్తే.. జీతం తీసుకోకుండా పనిచేస్తా.. : ధనపాల్ సూర్యనారాయణ గుప్తా

నిజామాబాదు వార్త: తనను గెలిపిస్తే ప్రభుత్వం ఇచ్చే జీతాన్ని కూడా పేదలకే ఇచ్చేస్తానని, అనుక్షణం ప్రజాసేవకు అంకితమౌతానని శివసేన పార్టీ నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి ధనపాల్ సూర్యనారాయణ గుప్త అన్నారు. బుధవారం ఆయన నిజామాబాదు నగరంలోని అయ్యప్ప మందిరంలో పార్టీ మేనిఫెస్టోకు పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను అడగకున్నా బీజేపీ 2014లో తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని, 30 సంవత్సరాలుగా హిందూధార్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ స్వచ్ఛందంగా పేదలకు ఎందరికో సాయం చేశానని, పార్టీ కోసం, కార్యకర్తల కోసం ఎంతో శ్రమించానని అయినా తన శ్రమను గుర్తించకుండా భాజపా తనకు సీటు కేటాయించకపోవడం తనకు, కార్యకర్తలకు ఎంతో బాధించిందని, కార్యకర్తలు అభిమానుల కోరిక మేరకే శివసేనతో చేరానన్నారు.  ప్రజలు తనకు ఓటు వేసి గెలిపిస్తే అందరికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ నగర అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.  ఎక్కడికి వెళ్లిన ప్రజలు ఆప్యాయంగా పలుకరిస్తున్నారని, వారి ప్రేమాభిమానాలు చూస్తుంటే.. నాకే ఆశ్చర్యం కలుగుతోందన్నారు. ప్రజల ప్రేమకు కంకణ బద్ధున్నైఅనుక్షణం  వారి అభివృద్ధికి పాటుపడతానని పేర్కొన్నారు. ఆయన వెంట గజం  ఎల్లప్ప, కొండ ఆశన్న, నాగోళ్ల లక్ష్మీనారాయణ, అంతరెడ్డి దేవేందర్, బూర్గుల వినోద్, వెంకటేష్, గంగకిషన్, మురళి, బద్దం కిషన్, శివసైనికులు ఉన్నారు. 
"ఈ ఛాయా గరీబుకి విందురా భాయ్.. " ఛాయ్ చేస్తున్న ధనపాల్ సూర్యనారాయణ 

వాహనదారులకు మేనిఫెస్టో కరపత్రిక ఇస్తున్న ధనపాల్ 

మేనిఫెస్టో కరపత్రికను అయ్యప్ప స్వాములకు అందజేస్తున్న ధనపాల్  

No comments:

Post a Comment