Friday, 16 November 2018

కాంగ్రెస్ కు బుద్ధి చెప్తాం : అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు మహిపాల్ యాదవ్

రాష్ట్ర జనాభాలో 18 శాతం ఉన్న గొల్ల, కురుమలకు కాంగ్రెస్ పార్టీ చిన్నచూపు చూస్తోందని, తమకు అసెంబ్లీ సీట్ల కేటాయింపులో అన్యాయం చేసిందని, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి  చెప్తామని  అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు మహిపాల్ యాదవ్ అన్నారు. శుక్రవారం నిజామాబాదు నగరం లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్ లోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో తమ సామజిక వర్గం ఓట్లు 30 వేలకు పైగా ఉంటాయని, మమ్మల్ని పట్టించుకోని కాంగ్రెస్ పార్టీకి తగువిధంగా ఓటుతో సమాధానం ఇస్తామని ఆయన అన్నారు. విలేకరుల సమావేశంలో సంఘం జనరల్ సెక్రటరీ లింగన్న యాదవ్, కురుమ సంఘం జిల్లా నాయకుడు  నర్సయ్య, యూత్ అధ్యక్షుడు గణేష్ యాదవ్, భూమన్న యాదవ్, రమేష్ యాదవ్, మహేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 


No comments:

Post a Comment