Tuesday, 6 November 2018

ధ్యానంతో ఆరోగ్యవంతమైన జీవితం సొంతం

నిజామాబాదు నగరంలోని గాయత్రినగర్ శ్రీ వేంకటేశ్వర కల్యాణ మండపంలో మంగళవారం సాయంత్రం ధునివాల పిరమిడ్ మెడిటేషన్ సెంటర్, వినాయక్ నగర్ వారి ఆధ్వర్యంలో ధ్యానం, యోగాపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిరమిడ్  స్పిరిట్యుయల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు సుభాష్ పత్రీజీ విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధ్యానంతో  ఆరోగ్యవంతమైన, ఒత్తిడి లేని  జీవితం జీవితం గడపవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమానికి ఆర్మూర్, కామారెడ్డి, జగిత్యాల, బాన్సువాడ తదితర ప్రాంతాల నుండి పిరమిడ్  స్పిరిట్యుయల్ సొసైటీస్ సభ్యులు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు ధ్యానం వల్ల కలిగిన లాభాలను, అనుభూతులను పంచుకొన్నారు. చివరగా  సుభాష్ పత్రీజీ ప్రజలతో  10 నిమిషాల పాటు ధ్యానం చేయించారు.  ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి పంచారు.   కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి సంబందించిన వీడియోల కోసం క్రింది లింకుని క్లిక్ చేయగలరు.

nizamabad vaartha 








No comments:

Post a Comment