Wednesday, 7 November 2018

భాజపాలో వర్గ పోరు.. అసలుకే ఎసరు ..?


నిజామాబాదు వార్త: ముందస్తు ఎన్నికల శంఖారావం మోగింది మొదలు నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్ల్యే సీట్ కోసం ఎండల లక్ష్మీనారాయణ, ధనపాల్ సూర్యనారాయణ గుప్త పోటీ పడ్డారు. వీరిలో ఒకరికి పార్టీ విధేయుడిగా పేరు ఉండగా... మరొకరికి పార్టీ కోసం కష్టపడ్డ వారుగా పేరుంది. దీంతో ఎవరికీ వారుగా అధిష్టానంతో టచ్ లో ఉంటూ టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. చివరికి అధిష్టానం గతంలో రెండు సార్లు అర్బన్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన యెండల వైపునే మొగ్గుచూపి అతడికే టికెట్ ను కట్టబెట్టింది. ఇదిగో ఇక్కడే మొదలైంది అసలు కథ.  యెండలకు టికెట్ కేటాయించడాన్ని జీర్ణించుకోలేని ధనపాల్ వర్గం ఒక్కసారిగా రెచ్చిపోయి  పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వర్గ పోరుతో అసలుకే ఎసరు వచ్చేట్టు ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. వీరిద్దరి మధ్య వర్గ పోరు ఇతర పార్టీలకు అనుకూలంగా మారితే, తప్పకుండ గెలిచే అవకాశం ఉన్న అర్బన్ సీట్ కూడా కోల్పోవాల్సి వస్తుందని భాజపా రాష్ట్ర నాయకుల్లో కలవరం మొదలైంది. దీంతో భాజపా రాష్ట్ర నాయకుడు దత్తన్న రంగంలోకి దిగినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ధనపాల్ సూర్యనారాయణను తమవైపు తిప్పుకోడానికి తెరాస ఎంపీ కవిత ప్రయత్నాలు మొదలెట్టినట్లు తెలుస్తోంది.  అలాగే మహాకూటమి నుంచి కాంగ్రెస్ పార్టీ సైతం అదే పనిలో ఉన్నట్టు సమాచారం. ధనపాల్ శివసేన పార్టీ నుంచి పోటీ చేయనున్నట్లు కూడా పుకార్లు వినిపిస్తున్నాయి. మరి ముందు ముందు ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే..!!!

No comments:

Post a Comment