Monday, 19 November 2018

నామినేషన్ల వేళ .. గంగిరెద్దు గోల ..!!

నిజామాబాదు నగరంలోని మున్సిపల్ కాంప్లెక్స్ ఆవరణలో పోలీసులు, పాత్రికేయులు, నామినేషన్ వేయడానికి వచ్చిన పలువురు రాజకీయ నాయకులతో హడావుడి వాతావరణం నెలకొని ఉంది. అయితే ఒక్కసారిగా వీరందరి చూపు ఒకరిపై పడింది. అదేదో నామినేషన్ వేయడానికి వచ్చిన ప్రముఖ నాయకుడో... లేదా ఏ పోలీసు ఉన్నతాధికారో అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లో.. ఎందుకంటే అక్కడికి వచ్చింది ఓ గంగిరెద్దులాయన. అతను సరాసరి మున్సిపల్ కాంప్లెక్స్ లోనికి వెళ్ళడానికి ప్రయత్నించాడు. డబ్బులకోసం " సారూ.. మీకు తోచినంత ఇవ్వండి సారూ... " అంటూ అతను అక్కడున్నవారిని బ్రతిమాలడం చూసి " "ఇల్లు కాలి ఒకడు ఏడిస్తే . చుట్టకు నిప్పు కావాలన్న" చందంగా తోచింది అతని వ్యవహార శైలి అక్కడున్న వారికి. దీంతో అందరూ అతన్ని చూసి నవ్వుకున్నారు. అక్కడే ఉన్న పోలీసులు అతన్ని అడ్డుకొని పంపించేశారు. ఈ చిత్రాన్ని నిజామాబాదు వార్త క్లిక్ మనిపించింది.

- వెంకట్ చింతకింది, నిజామాబాదు వార్త ప్రతినిధి 







No comments:

Post a Comment