Thursday, 15 November 2018

రెండు అధిష్టానాలున్న కూటమి ప్రజలకు ఏం చేస్తుంది..? : ఎంపీ కవిత

నామినేషన్ గడువు ముగియడానికి సమయం దగ్గర పడుతున్నా.. కూటమిలో అభ్యర్థులు ఖరారు కాలేదని, కూటమికి రెండు అధిష్టానాలు ఉన్నాయని, కాంగ్రెస్ ఢిల్లీ వెళ్లి అభ్యర్థులను ఖరారు చేస్తే.. చంద్రబాబు ఇక్కడ ఖరారు చేస్తారని ఆమె ఎద్దేవా చేసారు.  తెరాస నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేష్ గుప్తా నామినేషన్ అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ లో నాయకులకు నిర్ణయాధికారం లేదని, ప్రతి దానికి ఢిల్లీ వెళ్తారని, అలాంటివారు రేపు ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. తమ పార్టీకి ప్రజలే అధిష్టానం అని, 75 శాతం ప్రజల మద్దతు తమకుందని ఆమె పేర్కొన్నారు. కూటమి బలం బలగం తాటాకు చప్పుడు లాంటిదని అన్నారు. 


No comments:

Post a Comment