Friday, 16 November 2018

జర్నలిస్టులు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలి : కలెక్టర్ రామ్మోహన్ రావు

నిజామాబాదు వార్త; జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి లాంటి వారని, ఎన్నికల నేపథ్యములో నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని  కలెక్టర్ రామ్మోహన్ రావు అన్నారు. నిజామాబాదు నగరంలోని ప్రెస్ క్లబ్ లో  "నేషనల్ ప్రెస్ డే" సందర్భంగ నిర్వహించిన "ఎన్నికలలో మీడియా పాత్ర" చర్చా గోష్టి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. 1956లో  మొట్టమొదటి సారిగా నేషనల్ ప్రెస్ కౌన్సిల్ ఏర్పాటైన సందర్భంగా నవంబర్ 16 తేదీన "నేషనల్ ప్రెస్ డే"ను జరుపుకోవడం జరుగుతుందని ఆయన వివరించారు. అంతకు ముందు తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రభంజన్ కుమార్ సమాజంలో జర్నలిస్టుల పాత్రపై విఫులంగా వివరించారు.  పత్రిక విలువలు, ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల  నేపథ్యములో విలేకరుల పాత్ర తదితర విషయాలపై ఆయన  ప్రసంగించారు. అనంతరం నిజామాబాదు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు  దేవిదాస్, జనరల్ సెక్రటరీలు  కలెక్టర్ను, తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ ను . ఈ సందర్భంగా మూడు సార్లు ఉత్తమ జర్నలిస్ట్ గా అవార్డు తీసుకొన్న పుల్లెసన్మానించారు. అలాగే 3 సార్లు ఉత్తమ జర్నలిస్ట్ గా ప్రభుత్వం చేత అవార్డు అందుకొన్న పుల్లెల నరేందర్ ను  కలెక్టర్ చేతుల మీదుగా శాలువాతో సన్మానించారు. అనంతరం జర్నలిస్టులకు ఓటింగ్ అధికారులు అవగాహన కల్పించారు.

నిజాయితీగా పని చేయాలి : పుల్లెల నరేందర్ 

జర్నలిస్టులు నిజాయితీగా పనిచేయాలని, వృత్తి పరంగా ఎన్ని ఒత్తిడులు ఉన్నా విలువలు కోల్పోకుండా పనిచేయాలని సూచించారు. జర్నలిస్టులు కుటుంబానికి కూడా సమయం కేటాయించకుండా అహోరాత్రులు కృషి చేస్తారని, ఎంత ఒత్తిడి ఉన్నా వృత్తిని ఇష్టంగా నిర్వర్తిస్తారని అన్నారు. కొందరు జర్నలిస్టులు సరైన వేతనాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారని, విధులతో పాటు చదువుకు కూడా సమయం కేటాయిస్తే  వృత్తిలో పై స్థాయికి ఎదుగుతారని ఆయన సూచించారు.


మాట్లాడుతున్న కలెక్టర్ రామ్మోహన్ రావు 

మాట్లాడుతున్న తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్  ప్రభంజన్ కుమార్ 
పాల్గొన్న జర్నలిస్టులు కార్యక్రమం లో మాట్లాడుతున్న ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దేవిదాస్ 

ఉత్తమ జర్నలిస్టు పుల్లూరు నరేందర్ ను సన్మానిస్తున్న కలెక్టర్


కలెక్టర్ ను సన్మానిస్తున్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దేవిదాస్ 

తెలంగాణ యూనివర్సిటీ ప్రెఫెసర్ ప్రభంజన్ కుమార్ను సన్మానిస్తున్న ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రటరీ నరేందర్ 

పాత్రికేయులను ఉద్దేశించి మాట్లాడుతున్న ఉత్తమ జర్నలిస్ట్ పుల్లూరు నరేందర్ 

జర్నలిస్టులకు ఓటింగ్ పై అవగాహన కల్పిస్తున్న అధికారులు 
No comments:

Post a Comment