Friday, 16 November 2018

కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తెరాస కు వేసినట్లే: భాజపా నేషనల్ జనరల్ సెక్రటరీ పి.మురళిధర్ రావు

నిజామాబాదు వార్త : కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తెరాస కు వేసినట్లేనని, కాంగ్రెస్ తెరాస కు ఫ్రాంచైజీ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తెలంగాణాలో చంద్రగ్రహణమని భాజపా  నేషనల్ జనరల్ సెక్రటరీ పి.మురళిధర్ రావు అన్నారు. గురువారం నిజామాబాదు నగరంలోని భాజపా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. ఎంఐఎం, కాంగ్రెస్, తెరాసల మధ్య బంధం ఫెవికాల్ లాంటిదని, ఎంఐఎం పాకిస్తాన్ చొరబాటు దారులను హైద్రాబాదులో ఓటర్లుగా మారుస్తుందని, తెలంగాణాలో పాకిస్తాన్ రాజకీయాలను పోషించే పాత్ర ఎంఐఎం నడుపుతోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి, ప్రధాన వాగ్దానాలన్నింటిలో కూడా తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైనదని, ఏ గ్రామంలో, ఏ నగరంలో, ఏ విశ్వవిద్యాలయంలో కూడా ఉపాధి పొందిన యువత లేరన్నారు. తెరాస వ్యతిరేక ఓటులో యువత ప్రధాన భూమిక వహిస్తారని, దళితులు, షెడ్యూల్డ్ కులాల వారికి తెరాస ప్రభుత్వంలో దగా పడ్డామనే భావన ఉందని ఆయన పేర్కొన్నారు. 
తెరాస ప్రభుత్వాన్ని కాంట్రాక్టుల, కమీషన్ల ప్రభుత్వంగా ప్రజలు భావిస్తున్నారని, ప్రజలు పూర్తి మెజారిటీ ఇచ్చి అధికారం కట్టబెడితే ముందస్తు ఎన్నికలకు వెళ్లారని, దీనిపై ప్రజలకు సరైన వివరణ ఇవ్వలేదన్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో తీవ్ర జాప్యంతో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ నమ్మకం కోల్పోయిందని అన్నారు. 2018 ఎన్నికల్లో తెరాస కు మెజారిటీ రాదని, ఈ విషయం ప్రజల చర్చల ద్వారా స్పష్టం అవుతుందని, ఇంకా కొన్ని రోజులు గడిస్తే.. మరింత స్పష్టం అవుతుందని ఆయన అన్నారు. 2018 ఎన్నికల్లో భాజపా తప్పకుండా విజయబావుటా ఎగరవేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న భాజపా నేషనల్ జనరల్ సెక్రటరీ మురళీధర్ రావు 

సభావేదికను పరిచయం చేస్తున్న భాజపా జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి 

వేదికపై భాజపా నాయకులు 

మురళీధర్ రావును సన్మానిస్తున్న భాజపా జిల్లా నేతలు No comments:

Post a Comment