Sunday, 18 November 2018

అన్ని విధాలుగా తెరాస ప్రభుత్వం విఫలం

నిజామాబాదు వార్త :  ఉద్యమం పేరుతో ప్రజలను మభ్యపెట్టి ప్రభుత్వంలోకి వచ్చిన తెరాస అన్ని విధాలుగా విఫలమైందని కాంగ్రెస్ నిజామాబాదు రూరల్ అభ్యర్థి రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. ఆదివారం నిజామాబాదు నగరం మారుతినగర్ లోని తన నివాసంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న  తెరాస ప్రభుత్వాన్ని విభేదించి కాంగ్రెస్ లోనికి వచ్చానన్నారు. 14 ఏళ్ళు పనిచేసినా తెరాస తనను గుర్తించలేదని, కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే రాహుల్ గాంధీ నన్ను గుర్తించి నాకు సీటు కేటాయించారని  ఇందుకు  సహకరించిన ఉత్తమకుమార్ రెడ్డి, మధుయాష్కీలకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.
నిజామాబాదు ప్రజలు ఉమ్మడి జిల్లాల్లోని అన్ని స్థానాల్లో తెరాస ను గెలిపించారని, కానీ తెరాస ప్రభుత్వం ఉమ్మడి జిల్లా ప్రజలకు మోసం చేసిందని, ఇక్కడి  సింగూరు నీటిని మెదక్ జిల్లాకు  తరలిస్తోందని, మిడ్ మానేరు డ్యామ్ ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిని సిద్దిపేటకు,  సిరిసిల్లకు తరలిస్తోంది, అలాగే  ప్రభుత్వంలోని వచ్చిన వెంటనే 100  రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు ఆ పని చేయలేదని అయన పేర్కొన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా ప్రతి రంగంలో కూడా తెరాస ప్రభుత్వం విఫలమైందని ఆయన వివరించారు. ప్రజలు కెసిఆర్ ను నమ్మే పరిస్థితులలో లేరని, కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారని, ఎక్కడికి వెళ్లినా బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేసాడు.


విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ నిజామాబాద్ రూరల్ అభ్యర్థి భూపతి రెడ్డి 



No comments:

Post a Comment