Friday, 16 November 2018

మెండోరాలో కుల బహిష్కరణ

మెండోరా పద్మశాలి సంఘం నన్ను అకారణంగా  కుల బహిష్కరణ  చేశారని వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా  మెండోరా మండల కేంద్రంలో నివసిస్తున్న దాసరి మూర్తి  పేర్కొన్నారు. శుక్రవారం ఆయన నిజామాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం లో మాట్లాడారు. కుల బహిష్కరణతో పాటు మెండోరా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యుడినైన నన్ను కక్ష కట్టి ఆ పదవి నుంచి తొలగించేలా చేశారని  ఆయన ఆరోపించారు. సంబంధిత వ్యక్తులకు నోటీసులు పంపినా ఎలాంటి స్పందన లేదని, అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆయన కోరారు.





No comments:

Post a Comment