Wednesday, 21 November 2018

ఎవరినైనా చంపే ముందు అమ్మవారి మంత్రం జపిస్తా? : విచారణలో నిందితుడి వెల్లడి

నిజామాబాద్ వార్త:  "నేను ఎవరినైనా చంపే ముందు అమ్మవారి మంత్రాన్ని జపిస్తాను సార్?" అని చెప్పిన ఓ సీరియల్ కిల్లర్ మాటలు విని పోలీసులు షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. చంఢీఘడ్ కు చెందిన అనే వ్యక్తి దాదాపు 7 హత్యలు చేసాడు. ఇతడి పేరు హరియాణా క్రైమ్ బ్రాంచ్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా నమోదైంది.  కొన్ని నెలలుగా వెతుకుతున్న నిందితుడు సోమవారం రాత్రి పోలీసులకు పట్టుబట్టాడు. విచారణ లో అతని సమాధానాలు విన్న పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. " ఆ హత్యలన్నీ నేనే చేశాను సార్.  వారంతా ఫరీదాబాడ్,  పల్వాల్,  కురుక్షేత్ర, హరిద్వార్ ప్రాంతాలకు చెందిన వారు.. నాకు ఎలాంటి పాపం తగలొద్దని 108 సార్లు కాళీ మాత మంత్రం జపించి చంపేవాన్ని." అంటూ పోలీసుల విచారణలో పేర్కొన్నాడు. అయితే జగ్తార్  ఓ మానసిక వ్యాధిగ్రస్తుడని పోలీసులు తెలిపారు.



No comments:

Post a Comment