Thursday, 15 November 2018

డ్రైవర్ గా.. ఎంపీ కవిత !!!

ఏంటి టైటిల్ చూసి అవాక్కయ్యారా..? అవునండి మీరు చూసింది నిజమే. తెరాస పార్టీ, బిగాల గణేష్ గుప్త విజయం కోసం నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కార్ డ్రైవర్ గా మారి కారు నడిపారు.  కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుని విజయం కోసం శ్రీకృష్ణుడు రథసారథిగా ఎలా మారాడో నేడు బిగాల విజయంకోసం ఆమె రథసారథిగా మారారు.
గురువారం మూడో సెట్ నామినేషన్ వేయడానికి అందరు కలిసి గులాబి రంగు అంబాసిడర్ కారులో బయలుదేరడానికి సిద్ధమయ్యారు. బుధవారం స్వయంగా కారు నడుపుతూ వచ్చిన బిగాల నేడూ అందుకు సిద్ధమయ్యారు. ఇంతలో కవిత "అన్నా నువ్వు ముందు సీట్లో కూర్చో నేను కారు నడుపుతా.." అంటూ డ్రైవర్ సీట్లో కూర్చున్నారు. దీంతో ఇది ఊహించని  అక్కడున్న నాయకులు, కార్యకర్తలు ఆశ్చర్యానికి గురయ్యారు. గణేష్ గుప్త ఇంటి నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు కవిత డ్రైవింగ్ చేశారు. గేర్లు మార్చుతూ కారు స్పీడ్ పెంచుతూ దూసుకెళ్లారు. ఒక మహిళా కారు నడపడం సర్వసాధారణం కానీ ఒక ఎమ్మెల్యే గెలుపుకోసం ఒక మహిళా ఎంపీ కారు నడపడం అందరిని ఆకర్షించింది.


కారు డ్రైవింగ్ చేస్తున్న నిజామాబాదు ఎంపీ కవిత 

విజయం మనదే.. !!


అరె జెర్ర లొల్లి జెయ్యకుండ్రి అన్న .. ! (మీడియా ప్రతినిధులతో)

అన్నా... పో నువ్వే గెలుస్తవ్ ...!

కారు నడుపుతున్న నిజామాబాదు ఎంపీ కవిత


No comments:

Post a Comment