Sunday, 25 November 2018

అనుక్షణం పేదలకు మంచి చేయాలని ఆలోచిస్తా.. : రూరల్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్

నిజామాబాదు వార్త: అనుక్షణం పేదలకు మంచిచేయాలని ఆలోచించే వ్యక్తినని, పేదలకు మంచి చేస్తే వాళ్ళు నేను బాగుండాలని దేవుణ్ణి ప్రార్దిస్తారని అలా వారి దీవెనలతోనే ఈ స్థాయిలో ఉన్నానని నిజామాబాదు రూరల్ తెరాస అభ్యర్థి బాజిరెడ్డి  గోవర్ధన్ అన్నారు. ఆదివారం పాంగ్ర(బి) గ్రామం బ్యాంక్ కాలనీ బింగి కల్యాణ మండపంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇదే కాలనీలో ఉంటున్న నేను నా కుంటుంబ సభ్యులమంతా కూడా ఎప్పుడు మీ మధ్యలోనే ఉంటామని, ఏ సమస్య ఉన్నా నా వద్దకు రావొచ్చన్నారు.  నేను ఈ కాలనీకి వచ్చాక అనేక అభివృద్ధి పనులు చేశానని, అయినప్పటికీ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయని, వాటన్నింటిని పరిష్కరించుకోవాలంటే మీరందరు కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని కోరారు. తాను పదవిలో ఉన్నా లేకున్నా ఎప్పుడూ మీ సేవకున్నేనని అన్నారు.
కార్యక్రమం అనంతరం కాలనీవాసులు బాజిరెడ్డి దంపతులను సన్మానించారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న నిజామాబాదు రురల్ తెరాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ 

కార్యక్రమంలో పాల్గొన్న బాజిరెడ్డి కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు 


కార్యక్రమంలో పాల్గొన్న కాలనీ వాసులు 

బాజిరెడ్డిని సన్మానిస్తున్న కాలనీవాసులు 




బాజిరెడ్డి గోవర్ధన్ తో కాలనీ యువకులు 


No comments:

Post a Comment