Saturday, 24 November 2018

బాజిరెడ్డి గోవన్నా.. ! కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నా.. దయచేసి ఆదుకోండి.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న చిట్టి 

నిజామాబాదు వార్త : నిజామాబాదు జిల్లా డిచ్పల్లి మండలం మిట్టపల్లికి చెందిన ఈమె పేరు చిట్టి, ఈవిడ గత 10 సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది.  నిజామాబాదు నగరంలోని ప్రెస్ క్లబ్లో శనివారం విలేకరుల సమావేశంలో ఈమె తన గోడును వినిపించింది. ఇద్దరు కూతుర్లు ఉన్నారని, కూలి చేయనిదే పొట్టగడవని బ్రతుకు తమదని, డాక్టర్లు కిడ్నీ ఆపరేషన్కు రూ. 25 లక్షల వరకు  అవసరమని చెప్పారని, దయచేసి మా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారు తనను ఆదుకోవాలని వేడుకొన్నారు. దాతలు ఎవరైనా ఉంటె  ఆర్ధిక సాయం అందజేసి ఆదుకోవాల్సిందిగా ఆమె కోరారు. వివరాలకు దాతలు ఈ క్రింది నెంబర్లకు కాంటాక్ట్ చేయగలరు. 97003 89998, 90109 80037, 96761 74411.  కనీసం మీవంతుగా షేర్ చేయండి.





No comments:

Post a Comment