Wednesday, 21 November 2018

భవిష్యత్ రాజకీయాలను శాశించే స్థాయికి బి.సి.లు : ఆదె ప్రవీణ్ కుమార్

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బి.సి.లకు అత్యధిక సీట్లు కేటాయించిన రాజకీయ పార్టీలకు బిసిల తరఫున కృతజ్ఞతలని, భవిష్యత్ రాజకీయాలను శాశించే స్థాయికి బి.సి.లు ఎదుగుతారని తెలంగాణ బిసి మహాసభ జిల్లా కన్వీనర్ ఆదె ప్రవీణ్ కుమార్ అన్నారు.  బుధవారం నిజామాబాదు నగరంలోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  తెలంగాణ బిసి మహాసభల పోరాట ఫలితంగానే బిసిలకు ఎక్కువ సీట్లు కేటాయించారన్నారు. బరిలో నిలిచిన బిసి అభ్యర్థులకు అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. రాష్ట్ర జనాభాలో ఎక్కువ శాతం ఉన్న బిసిలు ఐక్యంగా ఉండి తమ అభ్యర్థులను గెలిపించుకోవాలని అయన పిలుపునిచ్చారు. అలాగే ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీకి వెళ్లిన బిసి ఎమ్మెల్యేలు బిసిల కోసం అలుపెరగని పోరాటం చేసి, బిసిల అభివృద్ధికి పాటుపడాలని ఆయన పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో తెలంగాణ బిసి మహాసభ జిల్లా కో-కన్వీనర్ ఈర్ల శేఖర్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు చింతోజి సోను, జిల్లా ప్రధాన కార్యదర్శి అబుల్ కోడ్ పద్మజ, జిల్లా కార్యదర్శి అనంతోజ్ అనురాధ, జిల్లా ఉపాధ్యక్షులు అమందు వేణు,  ముఖ్య సలహాదారులు గంగుల నరహరి, మహమ్మద్ జావీద్, మహమ్మద్ ఖాజా, చినకారి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఆదె ప్రవీణ్ కుమార్ 

No comments:

Post a Comment