Monday, 19 November 2018

చివరి రోజు నామినేషన్లతో హోరెత్తిన నిజామాబాదు నగరం

నామినేషన్ల దాఖలుకు చివరికి రోజైన సోమవారం ర్యాలీలతో రాజకీయ పార్టీలు హోరెత్తించాయి. చివరి వరకు టిక్కెట్లు ఖరారు కానీ అభ్యర్థులు ముందు నిరాడంబరంగా నామినేషన్లు దాఖలు చేసినప్పటికిని చివరి రోజు "డప్పు దరువులు, ర్యాలీలతో ప్రతి నియోజకవర్గంలో సందడి నెలకొంది. నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడం, పెద్ద సంఖ్యలో అభ్యర్థులు రావడంతో పోలీసులు తగు ఏర్పాట్లు చేశారు.

ఎవరు ఎక్కడ ?

దాఖలైన నామినేషన్లు : 102

నిజామాబాద్ రూరల్  తెరాస అభ్యర్థి: బాజిరెడ్డి గోవర్ధన్

కాంగ్రెస్ పార్టీ తరఫున : నిజామాబాదు అర్బన్  - తాహెర్ బిన్ హందాన్, రూరల్ - భూపతి రెడ్డి, కామారెడ్డి-షబ్బేర్ అలీ, బాల్కొండ-ఈరవత్రి అనిల్

భాజపా తరఫున : నిజామాబాదు రూరల్ అభ్యర్థి ఆనంద్ రెడ్డితో పాటు, బోధన్, జుక్కల్ నియాజకవర్గాల అభ్యర్థులు.

బి.ఎల్.ఎఫ్, బీఎస్పీ, ఎస్పీ అభ్యర్థులతో పాటు స్వతంత్రులతో  కూడా కొన్నిచోట్ల నామినేషన్ వేశారు.No comments:

Post a Comment