Sunday, 18 November 2018

నిజామాబాదు అర్బన్ స్వతంత్ర అభ్యర్థిగా కె.వి. లక్ష్మారెడ్డి నామినేషన్

నిజామాబాదు వార్త:   నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా శనివారం నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో  కె.వి. లక్ష్మారెడ్డి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలపై పాత్రికేయులకు పూర్తి అవగాహన ఉంటుందని, ఒక పాత్రికేయునిగా తన జీవితంలో ప్రజల కష్టాలను చాలా దగ్గరగా చూశానన్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా.. ఎన్ని ప్రభుత్వాలు మారినా.. ప్రజల బ్రతుకులు మారలేదని, వారి సమస్యలు తీరలేదని ఈ విషయమే  నన్ను రాజకీయాల్లోకి రావడానికి ప్రేరేపించిందని, అందుకే నిజామాబాదు అర్బన్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశానని ఆయన తెలియజేశారు. ప్రజలు నన్ను గెలిపిస్తే కష్టపడి పనిచేసి వారి రుణం తీర్చుకుంటానని  ఆయన  హామీ ఇచ్చారు. 

బీఫామ్ చూపుతున్న నిజామాబాదు అర్బన్ స్వతంత్ర అభ్యర్థి లక్ష్మారెడ్డి 

నామినేషన్ అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న లక్ష్మారెడ్డి 

No comments:

Post a Comment